మోడీ భజనలో కిషన్ రెడ్డి వాస్తవాలు మరిచిపోతున్నారా?
19-02-202019-02-2020 08:59:45 IST
Updated On 19-02-2020 09:00:08 ISTUpdated On 19-02-20202020-02-19T03:29:45.212Z19-02-2020 2020-02-19T03:29:42.182Z - 2020-02-19T03:30:08.185Z - 19-02-2020

తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పొడిగే క్రమంలో నోరు జారి తెలంగాణపై చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివారులోని చర్లపల్లిలో నిన్న రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పియూష్ గోయల్‌తో పాటు కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... ఎర్రబస్సులు మాత్రమే తెలిసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక రైళ్లు వచ్చాయని వాస్తవవిరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. బహుశా మోడీ ప్రభుత్వం వచ్చాక రెండు రాష్ట్రాల్లో రైలు సౌకర్యం లేని కొత్త రూట్లకు రైలు తీసుకెళ్తున్నామనేది కిషన్‌రెడ్డి వ్యాఖ్యల ఉద్దేశ్యం కావచ్చు. కానీ, అసలు తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం వచ్చే వరకు ఎర్రబస్సు మాత్రమే తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. నిజాం కాలంలోనే హైదరాబాద్ రాజ్యానికి స్వంత రైల్వే వ్యవస్థ ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు కిషన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. 1870లోనే నిజాం స్టేట్ రైల్వే ఏర్పాటయ్యిందని గుర్తు చేస్తున్నారు. కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న కీలకమైన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు దేశానికి స్వాతంత్రం రాకముందే నిజాం హయాంలోనే నిర్మితమైన విషయాన్ని గుర్తు చేస్తూ పోస్టింగులు పెడుతున్నారు. 1938 సంవత్సరంలోనే భద్రాచలం వెళ్లే ప్రయాణికులకు నిజాం స్టేట్ రైల్వే రాయితీ ప్రకటిస్తున్నట్లుగా ఉన్న అప్పటి పేపర్ కటింగ్‌ను కూడా ఓ నెటిజన్ పోస్టు చేసి కిషన్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. నిజాం రైల్వే గురించి స్వాతంత్య్రానికి ముందే ఇతర ప్రాంతాల ప్రజలు కూడా గొప్పగా చెప్పుకునే వారని, నిజాం స్టేట్ రైళ్లు సమయానికి వచ్చేవని, శుభ్రంగా ఉండేవనే అభిప్రాయం అప్పట్లో ప్రజల్లో ఉండేదని మరో నెటిజన్ గుర్తు చేశారు. ఇక, బ్రిటీష్ హయాంలోనే దేశంలో మొదట ప్రారంభమైన రైల్వే రూట్లలో మచిలీపట్నం - గుంటూరు ఒకటని మరో నెటిజన్ గుర్తు చేశారు. మొత్తానికి నరేంద్ర మోడీని పొగిడే క్రమంలో చేసిన వ్యాఖ్యలతో కిషన్‌రెడ్డి ఇరుకున పడ్డారు. టీఆర్ఎస్ కూడా ఆయన వ్యాఖ్యలకు ఇవాళ గట్టి కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది. అయితే, వివాదరహితుడిగా కిషన్‌రెడ్డికి పేరుంది. కానీ, ఆయన కేంద్రమంత్రి అయ్యాక నోరు జారి నాలుక్కరుచుకోవడం ఇది రెండోసారి. గతంలోనూ కేంద్రమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన కొత్తలో హైదరాబాద్ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
37 minutes ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
9 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
9 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా