newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీ పేదల పెన్నిధి.. కరోనా బాధితులకు గొప్ప ఊరట

27-03-202027-03-2020 08:04:51 IST
Updated On 27-03-2020 08:57:36 ISTUpdated On 27-03-20202020-03-27T02:34:51.285Z27-03-2020 2020-03-27T02:30:04.258Z - 2020-03-27T03:27:36.249Z - 27-03-2020

మోడీ పేదల పెన్నిధి.. కరోనా బాధితులకు గొప్ప ఊరట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా బాధితులను ఆదుకునేందుకు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు  ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద వచ్చే మూడు నెలల పాటు పేదలకు నేరుగా సాయం అందించనుంది కేంద్రం. రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ. .వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలు, రోజువారి కూలీలను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడి, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కి బీజేపీ ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. క్లిష్ట సమయంలో 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించి పేదల పెన్నిధి అని మోడీ మరోసారి రుజువు చేసుకున్నారన్నారు. ఆపద సమయంలో పేదలకు అండగా నిలిచిన మోడీకి ధన్యవాదాలు, శత కోటి నమస్కారాలు అన్నారు. ఈ ప్యాకేజి రైతులకు, పేద ప్రజలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాన్గులకు, గృహిణులకు పెద్ద ఊరటనివ్వడం ఖాయం అన్నారు. చిరు ఉద్యోగుల ఉద్యోగాలను కాపాడేందుకు కోసం మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, మోడీ రాజ్యంలో ఆకలి బాధలకు స్థానం లేదన్నారు.

ఈ ప్యాకేజీ వలన రాష్ట్రంలో ఉన్న 87లక్షల కుటుంబాలకు, 3 కోట్ల మంది పేదలకు ఆకలి బాధలు తప్పుతాయన్నారు. పేద ప్రజల ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా మోడీ ఈ ప్యాకేజిని రూపొందించారని, కరోనాను ముందువరుసలో ఎదుర్కొంటున్న వైద్య, పారిశుధ్య సిబ్బందికి మోడీ అందించిన 50 లక్షల బీమా భరోసానిస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు ఈ ప్యాకేజి ఒక పెద్ద ఉపశమనం అన్నారు.

ఈ ప్యాకేజి వలన పేద, మధ్యతరగతి ,దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన  దాదాపు 99శాతం కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని, ఈ ప్యాకేజి వలన రాష్ట్రంలో 59లక్షల మంది జాబ్ కార్డులన్న ఉపాధి హామీ కూలీలకు, ఉజ్వల గ్యాస్ పొందిన 9.36 లక్షల కుటుంబాలకు, 45 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళల కు, 5.5లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు, 50లక్షల మందిరైతులకు లబ్ది చేకూరుతుందన్నారు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని రాజ్యసభ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి వై సుజనాచౌదరి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle