newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

04-04-202004-04-2020 11:47:34 IST
Updated On 04-04-2020 14:12:21 ISTUpdated On 04-04-20202020-04-04T06:17:34.224Z04-04-2020 2020-04-04T06:07:51.907Z - 2020-04-04T08:42:21.465Z - 04-04-2020

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ, తర్వాత లాక్ డౌన్ అమలవుతోంది. ఈనేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ ని అంతం చేయడానికి ఈనెల 5వతేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను తరిమికొట్టాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 

Image may contain: text

ఈ నేపథ్యంలో మోడీ ఆలోచనపై మండిపడుతున్నారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కరోనాపై పోరాటం కోసం 9 నిమిషాలపాటు లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలన్న మోడీ ప్రకటనపై ఎంఐఎం అధినేత అసద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల జీవితాలను 9 నిమిషాలకు కుదించివేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. ఈ దేశం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ కాదంటూ ట్వీట్ చేశారు. 

ఈ దేశ ప్రజలకు ఎన్నో ఆశయాలు ఉన్నాయని, తమ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నారన్నారు ఓవైసీ. ప్రజలను మీ జిమ్మిక్కులతో మోసం చేయవద్దంటూ అసద్ ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రకటనలు కాకుండా ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఎంత సాయం చేశారు, ఎన్ని కోట్లు ఖర్చుచేశారో ప్రకటించాలని అసద్ డిమాండ్ చేశారు. మోడీ దీప సంకల్పాన్ని ట్యూబ్ లైట్ ఐడియాగా కొట్టిపడేశారు. దేశంలోని లక్షలాది మంది ఇళ్లలో ఉన్న చీకటి మోడీకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. దేశమంతా మోడీకి బ్రహ్మరథం పడుతున్నారు. అసద్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

మోదీ పై ఓవైసీ కి ఎందుకంత ద్వేషం. దేశమంతా ఒక్కటై కరోనా పై యుద్ధం చేస్తుంటే ఓవైసీ కు ఎందుకు ఇంత బాధ అని బీజేపీ జాతీయ మైనారిటీ మోర్చా నేత షేక్ బాజి అన్నారు. అసద్ ట్వీట్ పై ఆయన స్పందించారు. ఓవైసీకి ముస్లింల పట్ల అంతప్రేమ ఉంటే ముస్లిం పేదలకు ఆహార కేంద్రాలు ఎందుకు పెట్టలేదని, ఓవైసీ తన సొంత హాస్పిటల్ ను క్వారంటీన్లు గా మార్చి కరోనా బాధిత ముస్లింలకు ఇవ్వాలన్నారు.

సమాజంలో మత విద్వేషాలు సృష్టించి ముస్లింలను విడదీయాలనుకొంటున్నారని,  రాజకీయం వేరు జాతీయ విపత్తు వేరంటూ చురకలంటించారు షేక్ బాజి. ఇప్పటికైనా ఒవైసీ తన తీరు మార్చుకోవాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం చేయాలని చూస్తే భారతీయ ముస్లింలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు షేక్ బాజి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle