newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొన్న హైకోర్ట్.. నేడు కేంద్రం.. కేసీఆర్ తీరు మారేనా?

22-05-202022-05-2020 16:00:02 IST
Updated On 22-05-2020 17:02:43 ISTUpdated On 22-05-20202020-05-22T10:30:02.941Z22-05-2020 2020-05-22T10:30:00.388Z - 2020-05-22T11:32:43.601Z - 22-05-2020

మొన్న హైకోర్ట్.. నేడు కేంద్రం.. కేసీఆర్ తీరు మారేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు? రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని టెస్టులు చేశారు. రాష్ట్ర జనాభాలో టెస్టులు చేసిన శాతమెంత? దేశమంతా టెస్టులు చేసి కరోనాను కొంతమేర ఎదుర్కొనే మార్గాలను అన్వేషిస్తుంటే తెలంగాణ మాత్రం టెస్టులు చేసేందుకు ఎందుకు వెనకాడుతుంది? అసలు టెస్టులే చేయకుండా కరోనా కేసులు లెక్క ఎలా తేలుతుంది? ఇదే ఇప్పుడు కేంద్రం వేసిన ప్రశ్నలు.

గత నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఇదే తరహా ప్రశ్నలు సంధించగా.. నేడు కేంద్రం కూడా అవే ప్రశ్నలు వేసింది. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీతో సహా దేశం మొత్తం ముమ్మరంగా టెస్టులు చేస్తున్నారు. తెలంగాణలో అయితే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రయివేట్ కేంద్రాలకు కూడా కరోనా పరీక్షలకు అనుమతులిచ్చారు. కానీ టెస్టులు సంఖ్య మాత్రం పెంచడం లేదు.

పైగా కేంద్రం అనుమతిచ్చిన ప్రైవేట్ కేంద్రాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తుంది. ఒక్క హైదరాబాద్ మినహా మిగతా రాష్ట్రమంతా ఈ టెస్టులను దాదాపుగా నిలిపివేసినట్లుగా కనిపిస్తుంది. అత్యధికంగా కేసులు నమోదైన సూర్యాపేటలో కూడా టెస్టులు చేయడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడి సామజిక వేత్తలే హైకోర్టుకెక్కారు. అందుకే హైకోర్టు చీవాట్లు పెట్టింది.

మనం టెస్టుల ద్వారా వైరస్ ను వెంటాడకపోతే.. అదే మనల్ని వెంటాడుతోందని కేంద్రం తాజాగా తెలంగాణ ప్రభుత్వాన్ని సున్నితంగానే హెచ్చరించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 21 వేల టెస్టులు మాత్రమే చేశారని.. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువని.. ఇదే కొనసాగితే భవిష్యత్ లో జరిగే నష్టాలను ఎవరూ పూడ్చలేమని పేర్కొంది. దీనిపై తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ కు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్ లేఖ రాశారు.

జాతీయ స్థాయిలో 10 లక్షల మంది జనాభాలో 1,025 మందికి టెస్ట్ లు జరుపగా, తెలంగాణలో 546 మందికి టెస్టులు చేశారని.. అంటే దాదాపు సగం మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. విస్తృతంగా టెస్ట్ లు జరపడం ద్వారా పాజిటివ్ కేసులను ఎక్కువగా గుర్తించి, ఈ వైరస్ ను సమర్ధవంతంగా కట్టడి చేయడానికి వీలవుతుందని ప్రీతి సుడాన్ హితవు చెప్పారు.

ప్రైవేట్ కేంద్రాలపై ఆంక్షలు విధించడంపై కూడా సుడాన్ తెలంగాణను ఒకవిధంగా వారించారు. కాగా నాలుగు రోజుల క్రితం హైకోర్టు కూడా ఇదే విషయంపై ఘాటుగా స్పందించింది. కేరళను ఆదర్శంగా తీసుకొని కరోనాను ఎదుర్కోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. రోజుల వ్యవధిలోనే కేంద్రం స్పందించి పలు సూచనలు చేయడం విశేషం.

కాగా గత నెలరోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇదే విషయంపై గగ్గోలు పెడుతున్నాయి. కొంతమంది మేధావులు, వైద్యరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఇదే విషయంపై ప్రభుత్వానికి విజ్ఞపులు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఖాతరు చేయకుండా ముందుకు వెళ్తుంది. కరోనా పాజిటివ్ వ్యక్తితో సెంకండరీ కాంటాక్ట్ ఉన్న కేసులకు సైతం పరీక్షలు నిలిపివేసింది. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో? ఎలాంటి ఫలితాలను చూడాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   11 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle