మొదలైన 'మద్య'ధార.. పచ్చని సంసారాలలో రేగిన చిచ్చు..!
07-05-202007-05-2020 12:59:33 IST
Updated On 07-05-2020 13:03:20 ISTUpdated On 07-05-20202020-05-07T07:29:33.277Z07-05-2020 2020-05-07T07:29:31.296Z - 2020-05-07T07:33:20.584Z - 07-05-2020

దాదాపు నెలన్నర తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాలలో మద్యం ప్రవాహం మొదలైంది. ఏపీలో రెండు రోజులు ముందుగానే మద్యం అమ్మకాలు మొదలు కాగా తెలంగాణలో బుధవారం నుండి అమ్మకాలు మొదలయ్యాయి. ధరలను పెంచి మరీ ప్రభుత్వాలు ప్రజల నుండి డబ్బులు పిండేందుకు సిద్ధమైతే.. ఎన్నాళ్ళో వేచిన హృదయం అంటూ ప్రజలు తెల్లవారక ముందు మద్యం దుకాణాల ముందు క్యూ కట్టారు. ఫలితంగా బుధవారం ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యాభై కోట్ల వరకు అమ్మకాలు జరిగాయని అంచనా లెక్కలు చెప్తున్నాయి. పాత స్టాక్ ఉండగానే మంగళవారం సాయంత్రం నుండి బుధవారం ఉదయం వరకు కొత్తగా మద్యం షాపులకు అరవై కోట్ల సరుకు సరఫరా చేశారు. పాత స్టాక్ తో పాటు కొత్త స్టాక్ కూడా గురువారంతో ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తుండగా గురువారం ముమ్మరంగా సరఫరా చేసేందుకు ఎక్సైజ్ శాఖ పరుగులు పెడుతుంది. ఇన్నాళ్లు కరోనాని మహమ్మారిగా పేర్కొంటూ లాక్ డౌన్ ప్రకటించారు కానీ ఒక విధంగా కరోనా లాక్ డౌన్ ఒకటిన్నర నెల రోజుల పాటు ఎన్నో కుటుంబాలకు మేలే చేసింది. ఇన్ని రోజులు మద్యం దొరకకపోవడంతో రోజూ మద్యం సేవించి రచ్చ రచ్చ చేసే మందుబాబులు కూడా ఇన్నాళ్లు ప్రశాంతంగా కుటుంబాలతో కాలం గడిపారు. ఇతర ఏవో వ్యాపకాలతో కుటుంబాలకు దగ్గరయ్యారు. అయితే అసలైన మహమ్మారి మద్యం ఎంటర్ కావడంతో బుధవారం ఒక్కసారిగా ఎన్నోకుటుంబాలలో మళ్ళీ చిచ్చు మొదలైంది. దొరక్క దొరక్క దొరకడంతో కొందరు డోస్ పెంచి ఫుల్లుగా తాగేసి రోడ్ల మీద దొర్లితే మరికొందరు ఇళ్లల్లో భార్య, పిల్లలతో దాడులకు దిగారు. అమ్మకాలు ఇలా మొదలయ్యాయో లేదో బుధవారం ఒక్కసారిగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలో అల్వాల్ గ్రీన్ ఫీల్డ్ కాలనీలో కొందరు యువకులు ఫుల్లుగా మద్యం తాగి మత్తులో కారులో ప్రయాణిస్తూ ఓ ఇంట్లోకి దూసుకెళ్లారు. నల్గొండ జిల్లా దేవరకొండలో ఓ బెల్ట్ షాప్ వద్ద జరిగిన గొడవలో ఇద్దరు గాయాలపాలవగా ఆ ఇద్దరినీ చూసేందుకు వస్తున్న మరో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ గౌలిగూడకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ బాక్సులో చెయ్యి పెట్టి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. వరంగల్ అర్బన్ జిల్లాలో భవనంపైన మద్యం సేవించి మత్తులో ఇద్దరు పోట్లాడుకొని తోసుకోవడంతో ఒకరు పైనుంచి పడి మృతిచెందారు. హైదరాబాద్ ఛత్రినాకలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హాక్సాబ్లేడ్తో మరొకరి గొంతు కోశాడు. బాధితుడు చావుబ్రతుకులతో పోరాడుతున్నాడు. ఇవన్నీ బుధవారం మొదలైన అలజడిలో ఆవగింజలో కాలభాగం మాత్రమే కాగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం సృష్టించిన విధ్వంసానికి కొదువలేదు. మత్తులో పిచ్చి చేష్టలు, భౌతిక దాడులు, చిత్రహింసలు, ఆర్తనాదాలు, అవమానాలు, అనుమానాలు ఒకటేమిటి ఎన్నో విధాలుగా మద్యం మహమ్మారి పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతోంది. కానీ కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిందో లేదో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పోటీలు పడి ధరలను పెంచుతూ ప్రజలను ముగ్గులోకి దింపారు. మద్యం తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ప్రజలు మాత్రం అందుకు కూడా పోటీలు పడి క్యూలు కడుతుంటే.. ఖజానా నిండడమే ధ్యేయంగా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. యథా రాజా తథా ప్రజా అంటే ఇదేనేమో!

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా