newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొట్టికాయ‌లు కాదు వాత‌లు పెడుతున్నా స‌ర్కారు మార‌దా..?

16-07-202016-07-2020 09:55:05 IST
Updated On 16-07-2020 13:29:05 ISTUpdated On 16-07-20202020-07-16T04:25:05.057Z16-07-2020 2020-07-16T04:25:02.669Z - 2020-07-16T07:59:05.981Z - 16-07-2020

మొట్టికాయ‌లు కాదు వాత‌లు పెడుతున్నా స‌ర్కారు మార‌దా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'అవ‌స‌ర‌మైతే వెయ్యి కోట్లు అయినా పెట్టి క‌రోనాను తెలంగాణ‌లోకి రానియ్యం. ద‌బ్బున‌ వ‌స్తే ఎదుర్కుంటం.' 'వెయ్యి కాదు.. అవ‌స‌ర‌మైతే ఐదు వేల కోట్లు ఖ‌ర్చు పెడ‌తం. మాస్కులు క‌ట్టుకోకుండా ప‌ని చేస్తం.' 'ఏప్రిల్ 8 త‌ర్వాత తెలంగాణ‌లో క‌రోనా ఉండ‌దు.' ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో గుర్తింది క‌దా ! తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌రోనా వైర‌స్ రాష్ట్రానికి రాక‌ముందు, వ‌చ్చిన మొద‌ట్లో వివిధ సంద‌ర్భాల్లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ప‌దుల సంఖ్య‌లో కేసులు ఉన్న స‌మ‌యంలో ఆయ‌న క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు వ‌రుస స‌మీక్ష‌లు చేప‌ట్ట‌డం, క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, ప్ర‌జ‌ల‌కు నేరుగా మెసేజ్ ఇవ్వ‌డం చూసిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఒక ధైర్యం, ప్ర‌భుత్వంపై భ‌రోసా ఏర్ప‌డ్డాయి.

క‌రోనాను ఎదుర్కోవ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం క‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఏర్ప‌డింది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పుడు కేసీఆర్ భేష్ అన్న ప్ర‌జ‌లే ఇప్పుడు వేర్ ఈజ్ కేసీఆర్ అంటున్నారు. ప‌దుల సంఖ్య‌లో కేసులు ఉన్న‌ప్పుడే రాష్ట్రం ప‌ట్ల‌, రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌ట్ల అంత కేర్ తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదెందుకు అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కేవ‌లం ప్ర‌జ‌లే కాదు హైకోర్టు కూడా ఇదే ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తోంది. ప‌దేప‌దే ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేస్తోంది. విన‌క‌పోతే క‌ఠిన వ్యాఖ్య‌లు చేస్తోంది. మొట్టికాయ‌లు కాదు వాత‌లు పెడుతోంది. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. అస‌లు ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌స్తోంది అనేది ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది.

'క‌రోనాను ఎదుర్కోవ‌డంలో కేసీఆర్ ఫెయిల్ అంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఆసుప‌త్రుల‌లోని ప‌రిస్థితుల‌పై బాధితులే వీడియోలరూపంలో బ‌య‌ట స‌మాజంతో పంచుకుంటున్నారు. ఎవ‌రికైనా ల‌క్ష‌ణాలు ఉండి క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌న్నా చేసే ప‌రిస్థితి లేదు. ప్రైవేటు ల్యాబుల ముందు టాస్టుల కోసం బారులు తీరుతున్నారు. ఎలాగో క‌ష్ట‌ప‌డి ప‌రీక్ష‌లు చేయించుకుంటే రిపోర్టులు రావ‌డానికి రెండుమూడు రోజులు స‌మ‌యం ప‌డుతోంది. అంత‌లోపు ఆసుప‌త్రుల‌కు వెళ్తే పాజిటీవ్ రిపోర్టు లేనిదే చేర్చుకునే ప‌రిస్థితి లేదు. రిపోర్టు వ‌చ్చే లోపు ఆరోగ్య విష‌మిస్తోంది. కొంద‌రికైతే మ‌ర‌ణించిన త‌ర్వాత రిపోర్టులు వ‌స్తున్నాయి.

ఇలా క‌రోనాను ఎదుర్కోవ‌డంలో అనేక లోపాలు తెలంగాణ‌లో క‌నిపిస్తున్నాయి. నిజానికి ఇంత పెద్ద విప‌త్తు సంభ‌వించిన‌ప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి. కానీ, క‌నీసం క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ప‌రీక్ష‌లు చేయించుకునే ప‌రిస్థితి కూడా లేక‌పోవ‌డాన్ని మాత్రం చిన్న లోపంగా చూడ‌లేము. కేవ‌లం ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలే కాదు క‌రోనా విష‌యంలో హైకోర్టు ప‌దేప‌దే తెలంగాణ ప్ర‌భుత్వం ప‌నితీరును ప్ర‌శ్నిస్తోంది. తాజాగా మ‌రింత సీరియ‌స్ అయ్యింది. బ్రిటీష్ పాల‌న క‌న్నా ఘోరంగా తెలంగాణ పాల‌న ఉంద‌నే సీరియ‌స్ కామెంట్ చేసింది. ప్ర‌భుత్వానికి ఇంత అహంకార‌మా అని ప్ర‌శ్నించింది. టెస్టుల విష‌యంలో అయితే అనేక‌సార్లు హైకోర్టు మొట్టికాయ‌లు వేసింది.

నిజానికి అంత‌కుముందు మిగతా రాష్ట్రాల్లో వేల‌ల్లో టెస్టులు జ‌రుగుతుంటే తెలంగాణ‌లో మాత్రం రోజుకు రెండు, మూడు వంద‌ల టెస్టులు మాత్ర‌మే చేశారు. టెస్టుల సంఖ్య త‌క్కువ‌గా ఉన్నందున కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉండేది. తాము ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే, ఎందుకు దేశంలోనే టెస్టులు త‌క్కువ చేసిన రాష్ట్రాల్లో ఒక‌టిగా తెలంగాణ ఉంద‌నేది మాత్రం చెప్ప‌డం లేదు. ఆఖ‌రికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష‌వ‌ర్ధ‌న్ కూడా తెలంగాణ‌లో టెస్టులు త‌క్కువ చేస్తున్నార‌ని స్వ‌యంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ‌మంత్రి ఈటెల రాజెంద‌ర్‌తో ఉన్నారు. హైకోర్టు అనేక సార్లు టెస్టుల సంఖ్య పెంచాల‌ని ఆదేశాలు ఇచ్చింది. దీంతో టెస్టుల సంఖ్య‌ను ప్ర‌భుత్వం పెంచింది.

టెస్టులు ఎక్కువ చేస్తున్నందున కేసుల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంది. అయితే, ప్ర‌పంచ‌మంతా, దేశ‌మంతా ఇదే ప‌రిస్థితి ఉంది. క‌రోనా కేసులు అంత‌టా ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. అయితే, క‌నీసం ప్ర‌జ‌లకు అనుమానాలు, ల‌క్ష‌ణాలు ఉంటే టెస్టు చేయించుకునే ప‌రిస్థితిని క‌ల్పించ‌డంలో, మంచి వైద్యం అందించ‌డంలో కూడా ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతోంది అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో భ‌రించ‌లేని స్థాయిలో బిల్లులు వేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో క‌రోనా ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ఫీజుల‌ను ఖ‌రారు చేస్తూ జీఓ ఇచ్చిన ప్ర‌భుత్వం ఆ జీఓ అమ‌ల‌వుతుందా అనేది మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

గతంలో 100 - 200 కేసులు ఉన్న‌ప్పుడే రోజూ స‌మీక్ష‌లు పెట్టిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త 18 రోజులుగా క‌రోనాపై ఒక్క స‌మీక్ష కూడా పెట్ట‌క‌పోవ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ప్ర‌భుత్వం క‌రోనా వ్యాప్తిని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఈ విమ‌ర్శ‌ల‌న్నింటికీ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల స‌మాధానం ఇస్తూ క‌రోనాను ఎదుర్కోవ‌డంలో కేసీఆర్ ఫెయిల్ అయితే అస‌లు ఎవ‌రు పాస్ అయ్యార‌ని ఎదురు ప్ర‌శ్నించారు. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. కానీ, ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి శ్ర‌మిస్తున్నాయి. ముఖ్య‌మంత్రులు స‌మీక్ష‌లు జ‌రుపుతున్నారు. కొత్త ఆదేశాలు ఇస్తున్నారు. అవ‌స‌ర‌మైతే మ‌ళ్లీ లాక్‌డౌన్ పెడుతున్నారు. ఇలా ఇత‌ర రాష్ట్రాల్లో ఏదో ఒక ప్ర‌య‌త్నాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చేస్తున్నారు. తెలంగాణ‌లో మాత్రం కేసీఆర్ 18 రోజులుగా ఒక్క స‌మీక్ష కూడా చేయ‌లేదు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా తేరుకోక‌పోతే ప్ర‌జ‌ల‌కే కాదు పాల‌కుల‌కూ న‌ష్టం త‌ప్ప‌దు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle