newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మై డ్రీమ్స్ కిడ్స్ వీడియో ఆవిష్కరించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల

24-04-202024-04-2020 09:22:26 IST
Updated On 24-04-2020 09:56:54 ISTUpdated On 24-04-20202020-04-24T03:52:26.914Z24-04-2020 2020-04-24T03:51:19.493Z - 2020-04-24T04:26:54.981Z - 24-04-2020

మై డ్రీమ్స్ కిడ్స్ వీడియో ఆవిష్కరించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పరీక్షల ్లేవ్.. స్కూలుకెళ్లాలనే హడావిడి లేదు. అంతా స్టే హోం స్టే సేఫ్ అంటున్నారు. కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు లాక్ డౌన్ అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఆటల్లేవ్. చాలా బోరింగ్ ఫీలవుతున్నారు. కరోనా హాలిడేస్ లో పిల్లల్లో సృజనాత్మకత పెంపొందేలా పెద్దలు ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర  ఆరోగ్య శాఖ మంత్రి  ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.  మై డ్రీమ్స్ కిడ్స్ తయారుచేసిన తెలుగు నేర్చుకుందాం వీడియో ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. కరోనా భూతం విలయాన్ని చూసి పిల్లల చిన్ని మనసులు చలించాయి... తమవంతు ఏమైనా చేయాలని తపించాయి.

అమితాబ్ జీ స్టే హోం వీడియో చూసిన తర్వాత వారికీ ఒక ఆలోచన వచ్చింది.. వెంటనే అమల్లో పెట్టేశారు.. వాళ్ల ఐడియా విన్న తర్వాత తల్లిదండ్రులే కాన్సెప్ట్ రాసి,  కెమెరామెన్లుగా మారి ఒక వీడియో ఫిలిం తీశారు. హైదరాబాద్, బెంగుళూరు, విశాఖ, విజయవాడ ఇలా ఒక్కొక్కరూ ఒక్కో చోట ఉంటారు. కానీ ఒకేచోట ఉన్నట్టు అద్భుతంగా నటించేశారు. కరోనా ఎఫెక్ట్ తో వచ్చిన హాలిడేస్ నిసద్వినియోగం చేసుకొని మాతృభాషని నేర్చుకుందాం అంటూ ఇచ్చిన సందేశం మనసుల్ని తాకుతోంది... కరోనాపై పోరుకి మీకు తోచిన సాయంతో ప్రభుత్వానికి బాసటగా నిలవండి అని పిలుపునిచ్చారు... ఇంతకీ ఇందులో నటించిన వారంతా పదేళ్లలోపు పిల్లలే కావడం విశేషం... ఆ వీడియో మీరూ చూసి, మీ పిల్లలకు చూపించమంటున్నారు మంత్రి ఈటల. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle