newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

మే నెలాఖరు వరకు తెలంగాణలో సడలింపుల్లేని లాక్ డౌన్?

27-04-202027-04-2020 11:50:11 IST
Updated On 27-04-2020 11:52:26 ISTUpdated On 27-04-20202020-04-27T06:20:11.801Z27-04-2020 2020-04-27T06:20:09.890Z - 2020-04-27T06:22:26.995Z - 27-04-2020

మే నెలాఖరు వరకు తెలంగాణలో సడలింపుల్లేని లాక్ డౌన్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మే నెలాఖరు వరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగించనున్నారా? అంటే ప్రభుత్వ వర్గాల నుండి అవునని ఖచ్చితమైన సమాధానం వినిపిస్తుంది. కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ విధించగా ఈరోజు ప్రధాని మోడీ దేశంలో పరిస్థితులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆ కాన్ఫిరెన్స్ అనంతరం లాక్ డౌన్.. కరోనా కట్టడిపై కేంద్రం వైఖరి ఏంటన్నది ఒక స్పష్టత రానుంది.

అయితే తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ మే నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించే యోచనలో ఉన్నారని వినిపిస్తుంది. కేంద్రం మే 3 వరకు అన్నా తెలంగాణ ప్రభుత్వం ముందుగానే మే 7 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. పొరుగుల ఉన్న ఏపీలో కేంద్రం ఇచ్చిన సడలింపులు అమలు చేస్తున్నా తెలంగాణలో మాత్రం ఏ మాత్రం సడలింపులు లేకుండా లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

ఇప్పుడు అదే విధంగా మే నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. పీఎం మోడీతో వీడియో కాన్ఫిరెన్స్ కు ముందే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితులు.. లాక్ డౌన్ అమలు, పొడగింపుపై ఒక స్పష్టతలో ఉన్నారని చెప్తున్నారు. సాధారణంగానే కేంద్రం విధానాలను సమర్థిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కట్టడి చర్యలతో మాత్రం కేంద్రంతో విభేదిస్తూనే ఉంది.

కేంద్రం కూడా లాక్ డౌన్ అమలు.. సడలింపులును రాష్ట్రాలకే వదిలేసింది. అందుకు తగ్గట్లుగానే కేసీఆర్ లాక్ డౌన్ విషయంలో తొలి నుండి కేసీఆర్ కేంద్రం కంటే ముందే పొడగింపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాల సేకరణలో ఉండగానే కేసీఆర్ పొడగింపుకి సిద్దమైనట్లుగా తెలుస్తుంది. అది కూడా 3 వారాలకు తగ్గకుండా పొడగించాలని చూస్తున్నారట.

ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. మరో పదిరోజులలో ఇది మరి కాస్త సాధారణ స్థితికి చేరే అవకాశం ఉంది. అయితే.. అంత మాత్రాన మహమ్మారి వదిలి వెళ్లినట్లుగా అనుకొనే అవకాశం లేదు. ఇంకా కొత్త కేసులు నమోదవుతుండటంతో వారి నుండి కాంటాక్ట్ అయిన వారికి రెండు వారాల తరవాత లక్షణాలు బయటపడతాయి. అలా ఇది మరో రెండు వారాలు కొనసాగుతుంది.

అందుకే ప్రభుత్వం మరోసారి పొడగింపుకి సిద్దమైనట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్త కేసుల నమోదు ఆగిన అనంతరం రెండు వారాలు లాక్ డౌన్ అమల్లో ఉంటేనే పూర్తిగా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన మే మొదటి వారంలో కొత్త కేసుల నమోదు ఆగితే మే మూడో వారం వరకు పొడగించాల్సి ఉంటుంది. అనంతరం మరో రెండు రోజులలో రంజాన్ రానుంది.

రంజాన్ సమయంలో లాక్ డౌన్ ఎత్తేస్తే పెద్ద ఎత్తున రంజాన్ సంబరాలు చేసుకొనే అవకాశం ఉంటుంది. ప్రజలకు అవకాశం ఇస్తే అదుపు చేయడం కష్టమవుతుంది. కనుక ఒకేసారి రంజాన్ అనంతరం లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏ మాత్రం సడలింపులు ఇచ్చినా ఇన్నాళ్లు చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్న భావనలో సీఎం ఉన్నట్లుగా తెలుస్తుంది.  అయితే పొడగింపుపై అధికారిక ప్రకటన కోసం కేసీఆర్ తదుపరి ప్రకటన వరకు వేచి ఉండాల్సిందే.

 

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

   11 minutes ago


ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

   39 minutes ago


ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   12 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   13 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   15 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   16 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   16 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   17 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   17 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle