newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

మేము ఇంత రిస్క్‌ తీసుకుంటుంటే మీకు బయట పెత్తనాలేంటి.. డాక్టర్ ఆగ్రహం

25-03-202025-03-2020 12:04:02 IST
Updated On 25-03-2020 12:07:45 ISTUpdated On 25-03-20202020-03-25T06:34:02.851Z25-03-2020 2020-03-25T06:34:01.111Z - 2020-03-25T06:37:45.949Z - 25-03-2020

మేము ఇంత రిస్క్‌ తీసుకుంటుంటే మీకు బయట పెత్తనాలేంటి.. డాక్టర్ ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ఇటలీ ప్రజలు తమదేశం కరోనా వైరస్ కారణంగా విధ్వంసం అవుతుండటానికి తమ నిర్లక్ష్యమే కారణం.., ప్రభుత్వం మాటను చెవినపెట్టక చేతులారా ప్రాణాలమీదికి తెచ్చుకున్నాం అని విలపిస్తూ మేం చేసిన తప్పులు మరెవ్వరూ చేయకండి బుద్ధిగా ఇండ్లలోనే ఉండండి అని హెచ్చరిస్తున్నారు. కానీ భారత్‌లో జనతా కర్ప్యూను స్వచ్చందంగా అమలు చేసి సక్సెస్ చేసిన ప్రజలు మరునాడు సోమవారం కట్టు దప్పి రోడ్లమీదకు గుంపులుగా వచ్చేశారు. పనులు మాని సెలవులో ఉండండి అని ప్రభుత్వం చెబితే రోడ్లమీద తిరగడం ఎంత ప్రమాదకరంగా సామాన్యులకు అర్థం కావడం లేదు.. ఈ నేపథ్యంలో మేము కూడా మీలాగే లాక్ డౌన్ చేసుకుని ఇంట్లో ఉండిపోతే వైరస్ బారిన పడే మీ పరిస్థితి ఏమవుతుంది అంటూ ఒక డాక్టర్ రోడ్లమీద తిరిగే గుంపులకు మెత్తగా చీవాట్లు పెట్టాడు. ఇది తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లి తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది

మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు లాక్‌డౌన్ ప్రకటించిందో అర్థం చేసుకోకుండా గుంపులు గుంపులుగా తిరిగేస్తుూ.. ఇది తమ మంచికే అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో, రాష్ట్రంలో కరోనా ఎంత ప్రమాదకరంగా మారిందో, భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుపుతూ ఓ డాక్టర్‌ వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ డాక్టర్‌ చెప్పింది శ్రద్దగా వినండి అని పేర్కొన్నారు. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.. ‘లాక్‌డౌన్‌ ప్రకటించకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. మిమ్మల్ని అందరిని ఇంట్లో పెట్టి పారిశుద్య కార్మికులు, పోలీసులు, మా వైద్య బృందం మేమందరం మీకోసం ఈ ఆస్పత్రుల్లో పని చేస్తున్నాం. ఏ మాకు లేవా కుటుంబాలు ఇంతవరకు జీతాలు కూడా రాలేదు. అయినా సరే మేమందరం నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాం. కేవలం మీకోసం. ఇంత చేస్తున్నా మీరు పట్టించుకోకుండా మీకు నచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారు. తిరిగితే ఏమవుతుంది. మహా అయితే కరోనా అంటించుకుంటావు. 

నీకు కరోనా వచ్చిన విషయం 14 రోజుల వరకు తెలియదు. ఆ లోపు 1400 మందికి అంటిస్తావు. ఆ 1400 మంది ఇంకో 1400 మందికి అంటిస్తారు. నువ్వు, నీ కుటుంబం, నీ ఫ్రెండ్స్‌ అందరూ పోతారు. నువ్‌ బతికినవంటే పర్లేదు.. ఒకవేళ చస్తే నీ ఇంటికి నష్టమే కదా! నీ వళ్ల నీ కుటుంబం.. నీ కుటుంబం వళ్ల నీ పక్కింటివాళ్లు, నీ ఫ్రెండ్స్‌, వాళ్ల కుటుంబాలు ఇంత మంది నీ వెనక రావాలా ఏ నువ్వు ఒక్కడివి ఇంట్లో కూర్చోలేవా కొన్ని రోజులు నువ్‌ బయటకి రాకపోతే దేశానికి ఏమైనా నష్టమా?

మా ప్రాణాల మీద మాకు ఇష్టం, ప్రేమ, ఆశ ఉంటుంది కదా! మా కోసం మా కుటుంబాలు ఇంటి దగ్గర వేచి చూస్తుంటాయి కదా! మేము కూడా లాక్‌డౌన్‌ చేసుకొని ఇంట్లో ఉండిపోతే మీ పరిస్థితి ఏంటి ఏడుంటవ్‌. మా ప్రాణాలు తెగించి మీ కోసం ఇంత రిస్క్‌ తీసుకుంటే మీరేమో బయట పెత్తనాలు చేస్తుంటారా ఏ కొన్ని రోజులు ఇంటి నుంచి బయటకు రాకపోతే ఏమైనా కొంపలు మునిగిపోతాయా. బాధ్యత లేదా చదువుకోలేదా అర్థం కాదా దయచేసి ప్రజలందరికి అభ్యర్థిస్తున్నా.. కొన్ని రోజులు మీరు మీ ఇళ్లల్లోనే ఉండండి. ప్రభుత్వానికి సహకరిస్తూ వారు చెప్పే సూచనలను పాటించండి. కరోనాను తరిమికొట్టండి’ అంటూ ఆ డాక్టర్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle