newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మేడిగడ్డ బ్యారేజీ నుంచి 90 టీఎంసీల నీరు విడుదల.. శ్రీశైలంకి 25 టీఎంసీల వరద

17-08-202017-08-2020 11:14:02 IST
2020-08-17T05:44:02.339Z17-08-2020 2020-08-17T05:43:58.418Z - - 14-04-2021

మేడిగడ్డ బ్యారేజీ నుంచి 90 టీఎంసీల నీరు విడుదల.. శ్రీశైలంకి 25 టీఎంసీల వరద
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరుసగా నాలుగు  రోజలుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ జలప్రవాహంతో పోటెత్తుతోంది. రాష్ట్రంలోని వాగులు, వంకలతో పాటు ప్రధాన నదులన్నీ ఉరకలెత్తుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్ల ఎగువ రాష్ట్రాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాజెక్టుల్లోకి ఉధృతంగా ప్రవాహాలు పోటెత్తు తున్నాయి. ఆల్మట్టి, నారాయణ పూర్‌కు భారీగా వరద పెరిగింది. ఇక్కడకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మరోపక్క గోదావరి ప్రాజెక్టుల్లోనూ ప్రవాహాలు పుంజుకున్నాయి. ప్రాణహిత మహోగ్రరూపం దాల్చుతోంది.  

రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని వరద ప్రవాహంతో అన్ని నీటి ప్రాజెక్టులు జల సిరితో పొంగి పొర్లుతున్నాయి. ఎగువన మహా రాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పరీవాహకంలో కురుస్తున్న వానలు తోడవడంతో రికార్డు స్థాయి వరదతో పోటెత్తుతోంది. ప్రాణహిత నది మహోగ్ర రూపంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏకంగా నీటి ప్రవాహాలు 9.87 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతున్నాయి. వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ఏకంగా రోజుకు సుమారు 90 టీఎంసీల మేర నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. 

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోగా, భారీ ప్రాజెక్టులన్నీ నిండుకుండలు కానున్నాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ తొణికిసలాడుతుండగా, చెరువులన్నీ అలుగుపోస్తున్నాయి. ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది.

గోదావరి బేసిన్‌లోని 28, కృష్ణా బేసిన్‌లోని 8 ప్రాజెక్టులు పూర్తి నిల్వలతో తొణికిసలాడుతున్నాయి. మొత్తం ఈ 36 ప్రాజెక్టుల నీటి నిల్వల సామర్థ్యం 62 టీఎంసీల మేర ఉండగా, 51.28 టీఎంసీల నిల్వలు చేరుకున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు 1.39 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తు న్నారు. ఇదే జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు సైతం 40 వేల ప్రవాహం వస్తుండగా, మహబూబాబాద్‌లోని బయ్యారం ట్యాంక్‌కు 35,590 క్యూసెక్కులు, ఖమ్మం జిల్లాలోని వైరాకు 8,200, వరంగల్‌ రూరల్‌లోని పాకాల లేక్‌కు 8,402, ములుగు జిల్లాలోని పాలెంవాగుకు 12,452 క్యూసెక్కులు, రామప్ప లేక్‌కు 5,775, లక్నవరం లేక్‌కు 5,300 క్యూసెక్కుల మేర భారీ ప్రవాహాలు వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలేస్తున్నారు. 

మేడిగడ్డ బ్యారేజి నుంచి 90 టీఎంసీల నీరు దిగువకు విడుదల

ఎగువ ప్రవాహాలతో మేడిగడ్డ వద్ద ప్రాణహిత ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. మూడ్రోజుల కిందట మేడిగడ్డ వద్ద 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉండగా, శనివారం 3.48 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. అయితే, రెండ్రోజులుగా పరీవాహకంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం ఉదయానికి ఏకంగా 7.50 లక్షల క్యూసెక్కులకు, సాయంత్రానికి మరింత పెరిగి 9.87 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఇది దాదాపు 90 టీఎంసీలకు సమానం. మేడిగడ్డ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టీఎంసీలకు 9.87 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో బ్యారేజీ 65 గేట్లెత్తి అంతే నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. 

అన్నారం బ్యారేజీకి సైతం మానేరు వాగు నుంచి ప్రవాహాలు పెరగడంతో అక్కడి పంప్‌హౌస్‌ మోటార్లను నిలిపివేశారు. ఈ బ్యారేజీకి 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు 40 గేట్లెత్తి దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం అన్నారంలో నీటి నిల్వ 10.87 టీఎంసీలకుగాను 4 టీఎంసీల నిల్వ ఉంది. సుందిళ్ల బ్యారేజీలో 8.83 టీఎంసీలకు 6.42 టీఎంసీల నిల్వ ఉండగా, 6,208 క్యూసెక్కుల నీరు స్థానిక వాగుల నుంచి వస్తోంది. ఇక్కడి పంప్‌హౌస్‌ మోటార్లను నిలిపివేశారు. ఇప్పటివరకు జూన్‌లో మొదలైన సీజన్‌ నుంచి ఇంతవరకు మేడిగడ్డ నుంచి ఏకంగా 365 టీఎంసీల మేర నీరు దిగువకు వెళ్లిపోయిందని ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి.

శ్రీశైలంలోకి 25 టీఎంసీల వరద ప్రవాహం.. పోటెత్తుతున్న కృష్ణా

కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఇప్పటికే భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవటంతో స్థానిక పరీవాహకం నుంచి ఆల్మట్టిలోకి భారీ ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి 1.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, 1.80లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఈ నీరంతా నారాయణపూర్‌ వస్తుండటంతో అక్కడి నుంచి 2.37 లక్షల క్యూసెక్కులు నదిలోకి వదిలేశారు. ఈ నీరంతా జూరాలకు చేరుతోంది. జూరాలకు ప్రస్తుతం 1.03 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా, సోమవారానికి మరింత పెరగనుంది.

ప్రాజెక్టులో నీటి నిల్వ, ఎగువ ప్రవాహాల దృష్ట్యా 1.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలానికి వదిలారు. శ్రీశైలానికి ప్రస్తుతం 1.31 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీనికి తోడు ఎగువన ఉన్న తుంగభద్రలోకి 33,256 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ నీరంతా దిగువ శ్రీశైలానికి రానుంది. శ్రీశైలంలో ప్రస్తుతం 215 టీఎంసీలకుగాను 144.80 టీఎంసీల నిల్వ ఉంది. ఇక్కడి నుంచి 42 వేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా వదులుతుండటంతో నాగార్జునసాగర్‌లోకి 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాగర్లో నిల్వ 312 టీఎంసీలకుగాను 250 టీఎంసీలకు చేరింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle