newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

‘మేఘా’ పై ఐటీ మెగా పంచ్.. సోదాలతో ఉక్కిరి బిక్కిరి

21-10-201921-10-2019 07:30:43 IST
2019-10-21T02:00:43.780Z21-10-2019 2019-10-21T02:00:30.586Z - - 22-02-2020

‘మేఘా’ పై ఐటీ మెగా పంచ్.. సోదాలతో ఉక్కిరి బిక్కిరి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు ప్రాజెక్టులు స్వంతం చేసుకుని మెగా కాంట్రాక్ట్ సంస్థగా ఎదిగింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. ఈమధ్యకాలంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఇఐఎల్ అనే  కార్పొరేట్ సంస్థపై ఐటీ, ఈడీ అధికారులు వారం రోజుల పాటు సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై పరిధిలో ఉన్న ఆ సంస్థకు చెందిన 30 కార్యాలయాలపై ఏక కాలలో దాడులు చేశారు. ఐటీ దాడులు ప్రారంభమైన దాదాపు పది రోజుల తర్వాత.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ నుంచి.. ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. 

మేఘా సంస్థ దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు దక్కించుకుంది. ఇరిగేషన్, హైడ్రోకార్బన్, మౌలిక సదుపాయాలు, , పవర్ సెక్టార్లలో ప్రముఖ కంపెనీగా ఉన్న ఆ సంస్థ… వాటితో పాటు.. హవాలాను కూడా.. ఓ భారీ పరిశ్రమ తరహాలో నిర్వహిస్తున్న విషయం .. ఐటీ అధికారుల సోదాల్లో వెల్లడయినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారుల సోదాల్లో హవాలా వ్యాపారం గుట్టురట్టయింది. వివిధ ఖాతాలను ఐటీ అధికారులు సీజ్ చేశారని చెబుతున్నారు. 

వేల కోట్ల కాంట్రాక్టులు నిర్వహిస్తున్న ఆ సంస్థ.. హవాలా లావాదేవీలు, పన్నులు ఎగ్గొట్టే మార్గాల కోసం ఎన్నో దారులు వెతుక్కుందని అంటున్నారు. కొన్ని కోట్ల రూపాయలను ఎలాంటి నమోదు లేకుండా ఖర్చుచేసినట్టు సోదాల్లో తేలింది. వచ్చిన లాభంపై కట్టాల్సిన పన్నును ఎగ్గొట్టేందుకు … లెక్కలను తారుమారుచేశారు. వీటన్నింటినీ గుర్తించామని ఐటీ, సీబీడీటీ ప్రకటించింది. లెక్కలు తెలియని మరో రూ. 17 కోట్ల 40 లక్షలను కూడా సీజ్ చేసినట్లుగా సీబీడీటీ తెలిపింది.

ఐటీ, సీబీడీటీ అధికారులు ప్రెస్‌నోట్‌లో ఏ కంపెనీ పై దాడులు చేశారో వెల్లడించకపోవడం విశేషం. ఈ సంస్థకు ప్రభుత్వ పెద్దలకు సైతం అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా.. కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. అందువల్లే అంతగా ఈ దాడులకు సంబంధించి వార్తలు బయటకు రాలేదు. మరోవైపు ఏపీలో మరో ప్రాజెక్టు మేఘా సంస్థ ఖాతాలో చేరింది.

ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. దీనిలో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింది. రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ రూ. 491.6 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి ఎల్‌-1గా నిలిచింది. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle