newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

మెడికల్‌ కాలేజీల్లో పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేశాం..!

18-09-201918-09-2019 13:42:14 IST
Updated On 18-09-2019 13:48:47 ISTUpdated On 18-09-20192019-09-18T08:12:14.543Z18-09-2019 2019-09-18T08:12:06.396Z - 2019-09-18T08:18:47.865Z - 18-09-2019

మెడికల్‌ కాలేజీల్లో పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేశాం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఐదు మెడికల్‌ కాలేజీలు ఉండేవని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు పెట్టాలని మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ఒక్కో కాలేజీని 150 సీట్లతో ప్రారంభించడం జరిగిందన్నారు.

కేందప్రభుత్వం ఆధీనంలో ఉన్న కార్మిక శాఖతో సంప్రదింపులు జరిపి ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆనాడు పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మన ఎంపీలు పోరాడి..బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ను ప్రారంభించుకున్నామని చెప్పారు.

ప్రస్తుతం ప్రభుత్వపరంగా 11 మెడికల్‌ కాలేజీలు, ప్రైవేట్ పరంగా 23మెడికల్‌ కాలేజీలున్నాయన్నారు. వీటిలో మొత్తం 4790 సీట్లుండగా..1640 సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నాయని, ఈఎస్‌ఐ కాలేజీలో 100 సీట్లు, ఎయిమ్స్‌లో 50 సీట్లు ఉన్నాయని చెప్పారు. మెడికల్‌ కాలేజీల్లో పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేశామని ఈటల తెలిపారు. మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఇతర సిబ్బందిని పదొన్నతులు, ఇత్తర పద్దతుల ద్వారా భర్తీ చేశామన్నారు.

పల్లెలను బాగుచేయాలని ఛాలెంజింగ్‌ తీసుకున్నాం

పల్లెలను అభివృద్ధి చేయాలని ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దానిలో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో 30రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం ప్రతీగ్రామంలో నిర్వహించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అసెంబ్లిలో మంత్రి మాట్లాడారు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులను ఆదుకున్నామని, చెరువులను బాగు చేసుకున్నామన్నారు.

కాళేశ్వరంను ఛాలెంజింగ్‌గా పూర్తిచేసుకున్నామని, మిషన్‌ భగీరథను ఛాలెంజింగ్‌గా పూర్తిచేసుకున్నామని తెలిపారు. 24గంటల కరెంటు అసాధ్యం కానిది సాధ్యం చేసి చూపించామని తెలిపారు. రెండోసారి అధికారం చేపట్టాక గ్రామ సీమలు బాగుచేయాలని ఛాలెంజింగ్‌గా తీసుకుని పెద్దఎత్తున ముందుకు పోతున్నామన్నారు. డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాలు, చెత్త సేకరణ, మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్‌ కొనిచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నర్సరీలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీలకు అధికారాలు ఇచ్చాం, నిధులు ఇచ్చాం. నిధుల కొరత లేదని మంత్రి పేర్కొన్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle