newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

మెట్రో సర్వీసులు షురూ... మరి ఆర్టీసీ సిటీ బస్పుల సంగతేంటి?

02-09-202002-09-2020 08:30:15 IST
Updated On 02-09-2020 08:43:49 ISTUpdated On 02-09-20202020-09-02T03:00:15.457Z02-09-2020 2020-09-02T02:58:56.027Z - 2020-09-02T03:13:49.713Z - 02-09-2020

మెట్రో సర్వీసులు షురూ... మరి ఆర్టీసీ సిటీ బస్పుల సంగతేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా పుణ్యమాని ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటినుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఆగిపోయాయి. అన్ లాక్ 4 సందర్భంగానైనా సిటీ బస్సులు తిరుగుతాయని హైదరాబాద్ వాసులు భావించారు. కానీ సిటీబస్సులు ఎప్పటి నుంచి నడపాలనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, సిటీ బస్సులను నడిపే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు.

ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వం నుంచి మంగళవారం రాత్రి వరకు మౌఖిక ఆదేశాలు కూడా అందలేదని తెలుస్తోంది. ‘కేంద్రం మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులు నడిపేందుకు మేం సిద్ధమయ్యాం. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఓకే అంటే బస్సులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు’అని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్‌ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. మెట్రో రైళ్లలో ప్రయాణికులను నియంత్రించేందుకు పూర్తి అవకాశం ఉంది.

కానీ సిటీ బస్సుల విషయంలో అది సాధ్యం కాదు. కోవిడ్‌ కేసులు తీవ్రంగా పెరుగుతున్న వేళ సిటీ బస్సుల్లో ప్రయాణికులు అదుపుతప్పితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళనకు గురవుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఇప్పట్లో నడపకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు.  ప్రభుత్వం ఏం చెబుతుందోనని అధికారులు, సిటీ బస్సులు రోడ్లమీదకి వస్తే తమ ఖర్చులు తగ్గుతాయని సామాన్యులు ఆశిస్తున్నారు. 

కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్‌ లాక్‌–4 మార్గదర్శకా లను కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభు త్వం కూడా నాలుగో దశ అన్‌లాక్‌ మార్గదర్శ కాలను మంగళవారం విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పొడిగించడంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ కొన్ని కార్యకలా పాల విషయంలో ఆంక్షలు కొనసాగుతాయని రాష్ట్ర సర్కార్‌ స్పష్టం చేసింది.

 

 

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   7 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   8 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   9 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   9 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   9 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   9 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   10 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   10 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   11 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle