newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మెట్రో రయ్ రయ్.. కరోనా నిబంధనలు పాటించాల్సిందే

07-09-202007-09-2020 07:38:44 IST
Updated On 07-09-2020 07:51:42 ISTUpdated On 07-09-20202020-09-07T02:08:44.517Z07-09-2020 2020-09-07T02:08:39.892Z - 2020-09-07T02:21:42.343Z - 07-09-2020

మెట్రో రయ్ రయ్.. కరోనా నిబంధనలు పాటించాల్సిందే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్‌డౌన్‌ తరువాత హైదరాబాద్‌లో దశలవారీగా మెట్రోరైల్‌ సర్వీసులను పునఃప్రారంభిస్తున్నామని మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి తెలిపారు. నగరంలో  మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. రేపటి నుండి మెట్రో రైళ్లను పట్టాలెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడిక్కడ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెట్రో రైళ్లు నడిపించనున్నారు.. ప్రతి ఐదు నిముషాలకో రైలు తిరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.. ఉదయం ఏడు గంటలకు మొదటి రైలు అమీర్పేట్ నుండి మియపూర్ వెళ్లనుంది. 

శనివారం అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ సీఈఓ కేబీఎన్‌రెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు.మొదటి దశలో కారిడార్‌ 1 మియాపూర్, ఎల్‌బీనగర్‌ మార్గంలో ఈ నెల 7 నుంచి మెట్రోరైల్‌ అందుబాటులోకి రానుందని చెప్పారు. రెండో దశలో కారిడార్‌ 3 నాగోల్, రాయదుర్గ్‌ మార్గంలో, 8వ తేదీ, 9వ తేదీల్లో కారిడార్‌ 2తో పాటు అన్ని ఇతర మార్గాల్లో సర్వీసులు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

అన్‌లాక్‌ – 4 నిబంధనలు పాటిస్తూ సర్వీసులను నడిపిస్తామన్నారు. మెట్రోరైళ్లతో పాటు స్టేషన్‌ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు కోవిడ్‌–19 నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని సూచించారు.

చేతి మణికట్టు వద్ద థర్మల్‌ స్క్రీనింగ్, చేతులను శానిటైజ్‌ చేశాకే లోపలికి అనుమతిస్తామన్న ఆయన.. ప్రయాణికులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, ఒకవేళ మరచిపోయి వస్తే స్టేషన్లలో మాస్కులు కొనుక్కుని ధరించాలని, ప్రతిచోట భౌతికదూరం పాటించాలని వివరించారు. టెంపరేచర్‌ ఉంటే వెనక్కి పంపిస్తామని, అలాగే మెటల్‌ వస్తువులు వెంట తీసుకురాకూడదని స్పష్టంచేశారు.

రైల్లో 75 శాతం తాజా గాలి ఉండేలా టెర్మినల్స్‌ వద్ద రైళ్ల డోర్స్‌ను ఎక్కువ సమయం తెరిచి ఉంచుతామని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలును నడిపిస్తారు. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతారు. గతంలో ఒక్కో రైలులో 1,000 మంది ప్రయాణించే వారని, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం 300 మంది వరకు మాత్రమే ప్రయాణించడానికి అవకాశముందన్నారు. 

కాయిన్స్, కరెన్సీ వాడకం ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశముందని మెట్రో అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ఇది వరకే కలిగి ఉన్న స్మార్ట్‌ కార్డు ద్వారా క్యూఆర్‌కోడ్‌ టికెటింగ్‌తో ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణం ముగిసిన ప్రతీసారి క్యూఆర్‌ కోడ్‌ను స్కానింగ్‌ చేయాలి. భౌతికదూరం పాటిస్తూ వెళ్లాలి.

లిఫ్ట్‌లో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి వుంటుంది.  కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించిన భరత్‌నగర్, మూసాపేట, యూసుఫ్‌గూడ, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్‌ స్టేషన్లలో రైలు ఆగదు. రైలులో క్రాస్‌ మార్కు పెట్టిన చోట కూర్చోకూడదు. మార్కు చేసిన ప్రాంతంలోనే నిలబడాలి.  వైద్యం, అత్యవసర సేవల కోసం 7995999533 నంబర్‌ను సంప్రదించవచ్చని మెట్రో అధికారులు తెలిపారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle