newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

మెట్రో జర్నీ ఇక ఈజీ.. క్యూఆర్ కోడ్‌తో టికెట్లు

23-12-201923-12-2019 15:38:00 IST
2019-12-23T10:08:00.814Z23-12-2019 2019-12-23T10:07:59.294Z - - 22-02-2020

మెట్రో జర్నీ ఇక ఈజీ.. క్యూఆర్ కోడ్‌తో టికెట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ నగర ప్రయాణం ఇప్పుడు చాలా ఈజీగా మారిపోతోంది. ఒకప్పుడు మియాపూర్ నుంచి ఎల్ బి నగర్ వెళ్ళాలంటే గంటల తరబడి ట్రాఫిక్ జాంలతో కాలయాపన జరిగేది. కానీ హైదరాబాద్ మెట్రో రైలు పుణ్యమాని.. ప్రయాణం సమయం బాగా తగ్గిపోయింది. తాజాగా టికెట్లు తీసుకోవడం కూడా చాలా తేలికగా మారబోతోంది.

ఎంత దూరం ప్రయాణించాలన్నా స్టేషన్ కి వెళ్లకుండానే టికెట్ కొనుక్కునే సదుపాయం వచ్చింది. బస్సులకు, రైళ్లకు ఉన్న ఈ సదుపాయాన్ని ఇప్పుడు మెట్రో రైళ్లలో కూడా తీసుకురాబోతున్నారు. 

గంటల తరబడి క్యూలైన్లో నిలబడకుండా మీ స్మార్ట్ ఫోన్ లోనే టికెట్ ను కొనుగోలు చేసుకునే అవకాశం కలిగింది. నూతనంగా అమలులోకి రానున్న క్యూఆర్‌ కోడ్‌ టికెట్‌ కార్యక్రమాన్ని మెట్రో ఎండీ ఎన్ వి ఎస్‌ రెడ్డి సోమవారం హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయిన తరువాత ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్ కొనుక్కుంటే సరిపోతుంది.

ఈ టికెట్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన తరువాత ఓ క్యూఆర్ కోడ్ ను ప్రయాణికులకు ఇస్తారన్నారు. ఆ కోడ్‌ను స్కాన్ చేసి మెట్రో రైళ్లలో ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఎల్ అండ్ టీ మెట్రో ఈ క్యూఆర్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మనం ఏ స్టేషన్లో రైలు ఎక్కుతామో అక్కడ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి. తిరిగి మనం దిగే స్టేషన్లో స్కాన్ చేస్తే మన వ్యాలెట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.

హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఉదయం, సాయంత్రం వేళ రద్దీ బాగా పెరిగింది. దీనికి తోడు సిటీ బస్సుల సంఖ్య కూడా బాగా తగ్గిపోవడంతో ప్రయాణికులు మెట్రోరైళ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజూ దాదాపుగా 4 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను ఉపయోగిస్తున్నారు. ప్రయాణికుల కోరిక మేరకు గతంలో కంటే ముందే మెట్రోరైళ్లు ప్రారంభం అవుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6.30 నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి.

జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ కారిడార్‌ 2 మెట్రో లైన్లు కూడా జనవరిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ లైన్ అందుబాటులోకి వస్తే జంట నగరాల నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ మార్గం 11 కిలోమీటర్ల మేర ఉంటుందని. ఈ మార్గం సికింద్రాబాద్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి మీదుగా కోఠి నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వెళ్ళనుంది.

సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బస్సుల్లో వెళ్లేవారు ఈ మార్గం ద్వారా ఎంజీబీఎస్‌కు వెళ్లవచ్చు. ఈ మార్గంలో కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉండనుంది. క్యూ ఆర్ కోడ్ అమలులోకి వస్తే మరింత త్వరతిగతిన తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   6 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   12 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle