newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

మెట్రో గ్రాండ్ సక్సెస్.. జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్‌కి భారీ రెస్పాన్స్

12-02-202012-02-2020 08:38:10 IST
2020-02-12T03:08:10.671Z12-02-2020 2020-02-12T03:05:41.977Z - - 25-02-2020

మెట్రో గ్రాండ్ సక్సెస్.. జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్‌కి భారీ రెస్పాన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మెట్రో ప్రయాణం అద్భుత అనుభూతిని కలిగిస్తోంది. హైదరాబాద్ ప్రయాణం మరింత సులభతరం అయిపోయింది. సిటీలో ఈ మూల నుంచి ఆమూల వరకూ ఎటునుంచి ఎటుకైనా హాయిగా ఏసీలో ప్రయాణం చేసే అవకాశం కలుగుతోంది.

ముఖ్యమంత్రి కేసీయార్ ఈమధ్యే జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో సేవలు ప్రారంభించారు. ఈ మార్గంలో వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉండడంతో చిరు వ్యాపారులు మెట్రోలోనే తమ ప్రయాణం సాగిస్తున్నారు. కేవలం 16 నిముషాల్లోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కు చేరుకునే అవకాశం కలుగుతోంది.

ఈనెల 10వ తేదీ సోమవారం ఒక్కరోజే  33,886 మంది ప్రయాణించినట్లు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇందులో ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నుంచి అత్యధికంగా  14,894 మంది ప్రయాణం చేసినట్లు తెలిపారు. 

ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌కు సంబంధించి కారిడార్‌1లో 2,45,865 మంది, నాగోల్‌ నుంచి ఉప్పల్‌కు సంబంధించి కారిడార్‌3లో  2,45,825 మంది ప్రయాణించినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇలా మూడు మార్గాల్లో కలిపి 4.47లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. 

మరో విశేషం ఏమిటంటే... ఇందులో క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరగడం సంతోషంగా ఉందంటున్నారు మెట్రో అధికారులు. ఇది సోమవారం ఒక్కరోజే 47 వేలకు చేరుకుందని పేర్కొన్నారు. నెల రోజుల్లో జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో మెట్రోరైలు ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.అధిక రద్దీ విషయంలో  అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ 25,779 మంది ప్రయాణీకులతో ముందు వరుసలో ఉంది. 

అమీర్ పేట మెట్రో స్టేషన్ ఎప్పుడూ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఎల్బీనగర్‌ 24,181,  , రాయదుర్గం 21,957,మియాపూర్‌ 19,425 , కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు స్టేషన్‌ 16,677,  హైటెక్‌సిటీ 13,568,జేఎన్టీయూ 13,513, ఉప్పల్‌ 13,913, సికింద్రాబాద్‌ 15,294, జేబీఎస్‌ 14,894 మంది ప్రయాణీకులు  ఇలా ప్రతీ స్టేషన్‌లో ప్రయాణీకుల సంఖ్య పెరగడం ఎల్ అండ్ టీ, మెట్రో అధికారులను ఆనందంలో ముంచెత్తుతోంది.

మున్ముందు మెట్రో ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎండాకాలం రానుండడంతో శీతల ప్రయాణానికి ప్రయాణికులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle