మెట్రో అధికారులపై కిషన్ ఆగ్రహంలో న్యాయమెంత?
15-02-202015-02-2020 10:47:06 IST
Updated On 15-02-2020 10:57:15 ISTUpdated On 15-02-20202020-02-15T05:17:06.020Z15-02-2020 2020-02-15T05:16:41.943Z - 2020-02-15T05:27:15.481Z - 15-02-2020

హైదరాబాద్ మహా నగరంలో మెట్రో కారిడార్ 2 పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మొత్తం 11 కిమీ దూరంలో నిర్మితమైన ఈ మార్గాన్ని ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల సమక్షంలో ప్రారంభం జరిగిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రారంభించిన మరుసటి నాటి నుండే ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో నగర వాసులకు ట్రాఫిక్ సమస్యల నుండి మరికొంత ఉపశమనం లభించింది. అయితే, ఈ మార్గంలో మెట్రో ప్రారంభంపై రాష్ట్ర బీజేపీ నేతలు మెట్రో అధికారులపై తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మెట్రో యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈరోజు ఏకంగా దిల్‌కుశ అతిథి గృహంలో మెట్రో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అనంతరం మరికొందరు బీజేపీ నేతలతో కలిసి జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రోలో ప్రయాణించి తనిఖీలు చేయనున్నారు. అయితే, ఎంచక్కా.. నగర వాసులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చినందుకు సంతోషించాల్సింది పోయి అగ్రహాలు ఎందుకని కొంతమందికి అనుమానాలు రావచ్చు. హైదరాబాద్ నగరంలో మెట్రో అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో నిర్మితమైన వ్యవహారం. అయితే ఇక్కడ మెట్రో అధికారులు మాత్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు తప్ప కేంద్రాన్ని పట్టించుకోవడం లేదన్నది బీజేపీ నేతల వాదన. కారిడార్ 2 మార్గం ప్రారంభానికి కనీసం ప్రోటో కాల్ ప్రకారం బీజేపీ నేతలకు కనీసం ఆహ్వానాలు కూడా పంపకపోవడం బీజేపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. మెట్రో కారిడార్ 2 మార్గం దాదాపు 90 శాతం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉండగా ప్రారంభ కార్యక్రమం కూడా సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే నిర్వహించారు. అయితే, అదే పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ప్రారంభానికి ఆహ్వానం అందించలేదు. ఇక, బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచందర్ రావు కూడా స్థానికంగా సికింద్రాబాద్ పరిధిలోనే ఉంటారు. కనీసం ఆయనకు కూడా పిలుపు లేదు. పైగా ఒకపక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా కేంద్ర భాగస్వామ్యం ఉన్న ప్రాజెక్టు ఎలా ప్రారంభిస్తారని కిషన్ రెడ్డికి ఆగ్రహం తెప్పిస్తుంది. నిజానికి ఆ ప్రారంభ కార్యక్రమానికి ఒక్క బీజేపీ నేతలు తప్ప అందరూ హాజరయ్యారు. ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా కనిపించే మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ కూడా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసిన సన్నివేశాలు కూడా ఆ వేడుకలోనే కనిపించాయి. కానీ బీజేపీ నేతలకు ఆహ్వానం అందలేదని ఇప్పుడు బీజేపీ నేతలు తెరమీదకి కొత్త విషయాలను తీసుకొచ్చారు. కాగా, ఈరోజు మెట్రో తనిఖీలు, సమీక్ష సమావేశంతో కేంద్ర అధికారాలతో పాటు.. మెట్రో కేంద్ర భాగస్వామ్యం ఉందని ప్రజానీకానికి తెలియజేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
4 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago
ఇంకా