newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

మెట్రోకు పండగే పండగ..ఒక్కరోజే పాసెంజర్స్ 4లక్షలు

22-10-201922-10-2019 17:46:20 IST
Updated On 23-10-2019 15:10:55 ISTUpdated On 23-10-20192019-10-22T12:16:20.444Z22-10-2019 2019-10-22T12:15:38.499Z - 2019-10-23T09:40:55.900Z - 23-10-2019

మెట్రోకు పండగే పండగ..ఒక్కరోజే పాసెంజర్స్ 4లక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ మెట్రోరైల్ అధికారులు పండగ చేసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. బస్సులు లేక, ఆటోలు, ప్రైవేట్ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు మెట్రోకి పోటెత్తారు. ఈనెల 21వ తేదీన సోమవారం నాలుగు లక్షలకు పైగా ప్రయాణికుల మెట్రోని ఉపయోగించుకున్నారు. మెట్రో చరిత్రలో ఇదే రికార్డు అంటున్నారు. 

ఆర్టీసీ సమ్మెకి ముందు మెట్రో రైళ్ళలో అత్యధికంగా ప్రయాణించింది 3.75 లక్షలమంది. అయితే ఈ రికార్డుని చెరిపేసింది మెట్రో. మియాపూర్ నుంచి ఎల్ బి నగర్ వెళ్ళే ప్రయాణికులకు  ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. దీంతో వారంతా మెట్రోరైళ్ల ను ఆశ్రయించారు. హైదరాబాద్ లో ప్రదానమయిన రూట్ ఇదే కావడంతో సింహభాగం ఈ రూట్ లోనే ప్రయాణించారు. అడపాదడపా బస్సులు నడిచినా.. వాటిలో ఎక్కే చోటు లేక డబ్బులకు లెక్కచేయకుండా ప్రయాణికులు మెట్రో బాట పట్టారు.

ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకున్న మెట్రో అధికారులు ప్రత్యేక రైళ్ళ ద్వారా 120 అదనపు ట్రిప్పులను నడిపారు. దీంతో సోమవారం 830 ట్రిప్పుల మేర మెట్రో సర్వీసులను నడిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పీక్‌ అవర్స్‌లో ప్రతి 4 నిమిషాలకు..ఇతర సమయాల్లో ప్రతి ఏడు నిమిషాలకో రైలు నడపడం విశేషం. అమీర్ పేట జంక్షన్లో అయితే పండగ వాతావరణం నెలకొంది.

ఎగ్జిబిషన్ కి వచ్చినట్లు ప్రయాణికులు ప్లాట్ ఫారాలు నిండిపోయారు. ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లలో ఎల్భీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, లక్డికాపూల్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్‌ స్టేషన్లు కిక్కిరి పోయాయి. మెట్రోస్టేషన్లలోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశారు ప్రయాణికులు.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా తిరిగే నాగోల్‌–హైటెక్‌సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్‌సిటీ స్టేషన్లలో వేలాది మంది మెట్రో రైళ్లకోసం నిరీక్షించారు. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో అదనపు టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు ఇష్యూ చేశారు. మరికొన్నాళ్ళు ఆర్టీసీ సమ్మె జరిగితే.. ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle