newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

మెట్టు దిగితే.. బెట్టు చేస్తార‌నేనా..?

21-10-201921-10-2019 08:16:58 IST
2019-10-21T02:46:58.781Z21-10-2019 2019-10-21T02:42:41.387Z - - 24-02-2020

మెట్టు దిగితే.. బెట్టు చేస్తార‌నేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికుల స‌మ్మెపై విచార‌ణ జ‌రుపుతున్న సంద‌ర్భంలో ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డితే ప్ర‌భుత్వాలు ఆప‌లేవు అంటూ రాష్ట్ర ప్ర‌భుత్వంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇప్ప‌టికే ఆర్టీసీ కార్మికుల‌కు వివిధ రాజ‌కీయ ప‌క్షాలు, ప్ర‌జా, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతుండ‌టంతో కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. అయితే, ప్ర‌జ‌ల శ‌క్తి గురించి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు.

ప్ర‌జ‌ల శ‌క్తితోనే ఆయన తెలంగాణ సాధించారు. సాధించిన తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రి అయ్యారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఎక్కువ అవ‌గాహ‌న‌తో ఉండేది ఆయ‌నే. త‌మ‌కు వ్య‌తిరేకంగా ప్ర‌త్య‌ర్థులు క‌దుపుతున్న పావుల‌ను, రాజ‌కీయ వ్యూహాల‌ను స‌రిగ్గా అంచ‌నా వేయ‌గ‌లిగే సామ‌ర్థ్యం ఆయ‌న‌కు ఉంది.

కానీ, ఆర్టీసీ కార్మికుల స‌మ్మె విష‌యంలో ఆయ‌న త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నార‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అంద‌రూ ఏక‌మ‌య్యేందుకు కేసీఆర్ ఆల‌స‌త్వ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు.

అయితే, కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విష‌యంలో హైకోర్టు చెప్పినా మెట్టు దిగ‌క‌పోవ‌డానికి, చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించ‌క‌పోవ‌డానికి కార‌ణాలు వేరే క‌నిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప్ర‌భుత్వంపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతోంది. కానీ, ఆ ఒత్తిడికి త‌లొగ్గితే ప్ర‌భుత్వం రానున్న రోజుల్లో మ‌రిన్ని స‌మ్మెలు, ఉద్యోమాలను ఎదుర్కోవాల్సిన వ‌స్తుంద‌నే భావ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

అందుకే ఆర్టీసీ కార్మికులు స‌మ్మె విర‌మించి వ‌స్తే త‌ప్ప చ‌ర్చ‌లు జ‌రిపేది లేద‌ని ప్ర‌భుత్వం తేల్చి చెబుతోంది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా త‌లొగ్గేది లేద‌ని స్ప‌ష్టం చేస్తోంది. ఒక‌వేళ ప్ర‌భుత్వం మెట్టు దిగితే ఈ ఘ‌న‌త మ‌న‌దేన‌ని చెప్పుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు సిద్ధంగా ఉండ‌టం ఇందుకు ఒక కార‌ణం. ఇక‌, ఆర్టీసీ కార్మికుల బాట‌లోనే మ‌రికొన్ని ఉద్యోగ సంఘాలు వెళ్లే అవ‌కాశం ఉండ‌టం మ‌రో కార‌ణం.

ఆర్టీసీ కార్మికుల విష‌యంలో ప్ర‌భుత్వం మెట్టు దిగితే త‌ర్వాత త‌మ డిమాండ్ల‌ను సాధించుకునేందుకు మ‌రికొన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికుల బాట‌లోనే వెళ్లే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళ‌న‌ల‌కు సిద్ధంగా ఉన్నారు.

కొత్త రెవెన్యూ చ‌ట్టం తీసుకువ‌చ్చేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను తీసేసి పంచాయ‌తీరాజ్ శాఖ‌లో క‌లుపుతార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే వీరంతా ఒక ద‌శ నిర‌స‌న‌లు తెలిపారు.

ఆర్టీసీ కార్మికులు క‌నుక ప్ర‌భుత్వం మెడ‌లు వంచింద‌నే అభిప్రాయం ఏర్ప‌డితే వీరంతా కూడా స‌మ్మెకు సిద్ధం అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రికొన్ని శాఖల ఉద్యోగులు సైతం త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఉద్య‌మ బాట ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకొనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల స‌మ్మె వ్య‌వ‌హారంలో మెట్టు దిగ‌వ‌ద్ద‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. కార్మికులే స‌మ్మె విర‌మించి చ‌ర్చ‌ల‌కు రావాల‌నుకుంటున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle