మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
27-05-202027-05-2020 15:14:35 IST
Updated On 27-05-2020 15:28:24 ISTUpdated On 27-05-20202020-05-27T09:44:35.764Z27-05-2020 2020-05-27T09:44:33.453Z - 2020-05-27T09:58:24.523Z - 27-05-2020

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెలవరిస్తున్న లెక్కలు, వైద్య పరీక్షల తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణలో రోగులు ఎలా చనిపోయినా సరే వారందరికీ కరోనా టెస్టులు చేయాల్సిందేనని ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాలను పక్కనబెట్టి మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించరాదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఏ విధంగా ఉత్తర్వులు జారీ చేశారో అర్థం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా సంక్షేమం అంటే ప్రజారోగ్యమేనని గుర్తించాలని, అమెరికా వంటి అగ్రరాజ్యమే అల్లాడుతుంటే తెలంగాణలో రోజుకు 518 కరోనా నిర్దారణ టెస్టులు చేసి ఊరకుండిపోవడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోనా పరీక్షలు, వలస కార్మికులు, ఇతర అనుబంధ అంశాలపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత నెలరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజారోగ్య శాఖలు ఇస్తున్న ఉత్తర్వుల తీరునే ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా టెస్ట్‌ల గణాంకాలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ సంచాలకుడు ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఏవిధమైన అనారోగ్యంతో మరణించినా కరోనా పరీక్షలు నిర్వహించాలి. ప్రజా సంక్షేమం అంటే ప్రజారోగ్యమేనని గుర్తించాలి...’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటిస్తూనే పలు సూచనలు చేసింది. ‘కరోనా అగ్రరాజ్యాలనే అల్లాడిస్తోంది. అమెరికాలో లక్ష మంది వరకు చనిపోయారు. మందులేని ఆ మహమ్మారిని మట్టుబెట్టేందుకు ఇప్పటివరకు మనదేశం తీసుకున్న చర్యలు బాగున్నాయని సంతృప్తి చెందితే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదముంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏపీ, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో పదిలక్షలకు 2 వేల పరీక్షలు నిర్వహిస్తుంటే తెలంగాణలో 518 పరీక్షలు మాత్రమే చేయడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించరాదని గత ఏప్రిల్ 10, 28 తేదీల్లో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఏవిధంగా ఆ ఉత్తర్వులు జారీ చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. ఒక పక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాలు ఇచ్చినా ఎందుకు ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారని ప్రశ్నించింది. కరోనా ఉన్న వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియల్లో పాల్గొన్న వారికీ కరోనా సోకే ప్రమాదం ఉంటుందని వైద్య శాఖ ఎందుకు గుర్తించలేదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. గుండెజబ్బు లేదా ఇతర దీర్ఘకాల రోగాలతో బాధపడే వారు మరణించినా కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారు, కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే వలస కార్మికులకు పరీక్షలు నిర్వహిస్తే 118 మందికి వ్యాధి లక్షణాలున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ నివేదికలో పేర్కొందని, పరీక్షలు ఎంతమందికి నిర్వహించారో అందులో పేర్కొనలేదని హైకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. ఆరు రాష్ట్రాల సరిహద్దున్న రాష్ట్రానికి రైలు, బస్సు, నడిచి వచ్చే వలస కార్మికులకు ఎంతమందికి పరీక్షలు నిర్వహించారో తెలియజేయాలని ఆదేశించింది. రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులకు ఇప్పటి వరకు ఎన్ని టెస్ట్‌లు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 ,443 మందికి పరీక్షలు నిర్వహించామని వివరించారు. అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకభవించని న్యాయస్థానం.. ఇప్పటి వరకు ఎంత మంది ప్రైమరీ,సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్ట్‌లు నిర్వహించారో జూన్ మొదటి వారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరీక్షల నిర్వహణపై రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు లేఖలు రాసిందని, దానిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కోరింది. నిర్మల్‌లో 600 మంది వలస కార్మికులు క్వారంటైన్లో ఉన్నారని మాత్రమే నివేదికలో ఉందని, ఎన్ని పరీక్షలు చేస్తే అంతమందిని క్వారంటైన్లో ఉంచింది వివరించలేదని తప్పుపట్టింది. అదేవిధంగా సూర్యాపేటలో ఈ నెల 22 నుంచి 35 నమూనాలు సేకరించినట్లుగా నివేదికలో ఉందని, వలస కార్మికులు రావడం మొదలైన తర్వాత అతి తక్కువగా నమూనాలు సేకరించారని పేర్కొంది. ఎంతమంది వలస కార్మికులు వచ్చారో, ఎంతమందికి పరీక్షలు చేశారో, వారిలో ఎంతమందికి పాజిటివ్ వచ్చిందో వంటి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను జూన్ 1వ తేదీకి వాయిదా వేసింది. రెడ్ జోన్లను ఏ ప్రాతిపదికను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చుతున్నారనే విషయంలో మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వం తదుపరి విచారణలో వివరించాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా, ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయనవసరం లేదని కొంతకాలంగా బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజారోగ్య శాఖకు హైకోర్టు ఒకరకంగా ఝలక్ ఇచ్చినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా