newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మృతదేహాన్ని అప్పగించడానికి 4 లక్షలా.. ప్రైవేటుపై వేటు తప్పదు.. ఈటెల ధ్వజం

06-08-202006-08-2020 06:21:18 IST
2020-08-06T00:51:18.758Z06-08-2020 2020-08-06T00:51:15.963Z - - 11-04-2021

మృతదేహాన్ని అప్పగించడానికి 4 లక్షలా.. ప్రైవేటుపై వేటు తప్పదు.. ఈటెల ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మృతదేహాన్ని అప్పగించడానికి నాలుగు లక్షలు గుంజుతారా... ప్రైవేట్ ఆసుపత్రుల తీరు మానవ సమాజానికే కళంకం. ఇప్పటికైనా ప్రైవేట్ ఆసుపత్రులు పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల వసూళ్లపై వేల ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే బాధితులతోనూ మాట్లాడానని మంత్రి చెప్పారు. 

కరోనా చికిత్సను వ్యాపార కోణంలో చూడొద్దని చెప్పా. కానీ వారు అనేక రకాలుగా వేధిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నాయి. లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మృతదేహాన్ని అప్పగించడానికి కూడా రూ.4 లక్షలు కట్టాలని అడగటం మానవ సమాజానికే కళంకం. హీనమైన చర్య. పదే పదే చెప్పినా వైఖరి మార్చుకోవడం లేదు. దీనిపై కమిటీలు వేసి విచారణ జరుపుతున్నాం. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకుంటే కరోనా చికిత్స అనుమతులను రద్దు చేస్తాం. 

ఇప్పటికే కొన్ని ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నాం. రెండు, మూడ్రోజుల్లో మరికొన్నింటిపై చర్యలుంటాయి. ప్రస్తుతం డబ్బుల సంపాదనకు బ్లాక్‌ మెయిల్‌ చేసే సందర్భం కాదు.. అని మంత్రి వ్యాఖ్యానించారు. సోమవారం డెక్కన్‌ ఆసుపత్రిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. మంగళవారం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిపై కూడా ఫీజుల వసూళ్లకు సంబంధించి చర్యలు తీసుకుంటూ కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసింది. 

గ్రామాల్లో కరోనా లక్షణాలున్న వారిని గుర్తిస్తే పీహెచ్‌సీలోనే టెస్టులు చేయాలి. అనారోగ్యంతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే ముందుగా చేర్చుకొని చికిత్స చేయాలి. తర్వాతే కరోనా పరీక్ష చేయించాలని ఈటల ఆదేశించారు. పీహెచ్‌సీ స్థాయిలో కూడా కరోనా చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వల్ప ధరలవే. నిపుణుల కమిటీ ప్రకారం రూ.వెయ్యికి మించవు. 

ఇక వెంటిలేటర్ల గురించి ఆలోచించవద్దు. అంతవరకు పోయాడంటేనే మనిషి ప్రాణాపాయంలోకి వెళ్లారని అర్థం. 10 రోజుల పాటు ఒక రోగికి ఆక్సిజన్‌ పెడితే రూ. 2,500 మాత్రమే ఖర్చవుతుంది. ఏ ఆసుపత్రి అయినా బాధితులకు ఇచ్చే చికిత్స ఇదే.. ముదిరితేనే ఖరీదైన చికిత్స అవసరం. మందులు, వైద్యులు, ఆక్సిజన్, వెంటిలేటర్లకు కొరత లేదు. జిల్లాల్లోనూ ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. మంత్రులు, కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు.. అని మంత్రి ఈటల వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు, ఇతర కారణాలతో చనిపోయినా శవాలను రానివ్వడం లేదు. భౌతికకాయాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదు. మృతదేహాన్ని ప్యాక్‌ చేసి ఇచ్చేది మనుషులే కదా, వారికి రాని వైరస్‌ ఇతరులకు వస్తుందా.. అని మంత్రి వ్యాఖ్యానించారు. 

కోవిడ్‌ చికిత్సల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రిపై ప్రభుత్వం వేటు వేసింది... సదరు ఆసుపత్రికి ఇచ్చిన కోవిడ్‌ చికిత్సల అనుమతిని రద్దు చేసింది. ఇప్పటికే ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న రోగులకు యథావిధిగా చికిత్సలందించాలని స్పష్టం చేసింది. ఇకపై కొత్త కేసులను తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. 

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–1లో ఉన్న విరించి ఆస్పత్రి కోవిడ్‌ చికిత్సల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అబిడ్స్‌కు చెందిన 81 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగి జూలై 22న విరించి ఆస్పత్రిలో చేరగా.. 31న మృతి చెందారు. కేవలం 8 రోజులకు రూ. 8 లక్షలకుపైగా బిల్లు వేశారు. ఇందులో 246 పీపీఈ కిట్లు వాడినట్లు చూపించి రూ.2,23,560 బిల్లు వేయడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు.

అదే విధంగా కోవిడ్‌ వ్యర్థాల నిర్వహణ, తరలింపు విషయంలోనూ ఆస్పత్రి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇటు జలమండలి సహా ట్రాఫిక్‌ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. వీటితో పాటు కోవిడ్‌ చికిత్సల పేరుతో చంపాపేటకు చెందిన ఓ యువ న్యాయవాది నుంచి రూ.16 లక్షలకుపైగా బిల్లు వసూలు చేశారని వైద్య ఆరోగ్యశాఖ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు అందింది. 

మీడియాలో వరుస కథనాలకు తోడు బాధితుల ఫిర్యాదులకు స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్సలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితం సోమాజిగూడలోని డెక్కన్‌ ఆస్పత్రిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా విరించిపై వేటు వేయడం కొసమెరుపు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle