newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మృగశిర కార్తెతో ఉపశమనం... చేపల మార్కెట్లకు కళ

07-06-202007-06-2020 11:38:14 IST
2020-06-07T06:08:14.039Z07-06-2020 2020-06-07T05:59:41.744Z - - 12-04-2021

మృగశిర కార్తెతో ఉపశమనం... చేపల మార్కెట్లకు కళ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక వైపు కరోనా వైరస్ వ్యాప్తితో జనం భయపడిపోతున్నారు. దీనికి తోడు వేసవి వేడి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కృత్తిక‌, రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగ‌శిర‌ కార్తె ప్రవేశంతో ఉపశమనం లభిస్తుంది.. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో వాతావరణం చల్లబడుతుంది. చల్లబడిన వాతావరణంతో మానవ శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గి, వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.. నేడు రోహిణి కార్తె ముగిసి రేపటి నుండి మృగశిర కార్తె ప్రారంభం కానుంది.. మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు తింటే వ్యాధులు దూరమవుతాయనేది బలమైన నమ్మకం. దీంతో నేడు నగరంలో చేపల మార్కెట్లు రద్దీగా మారాయి.. 

అసలే ఆదివారం. అందునా మృగశిర కార్తె రోజు చేపల మార్కెట్లో అమ్మకాలు జోరుగా ఉంటాయి. ధరలు కూడా మిగతా రోజుల కంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయి.  ఉదయం నుంచే చేపల మార్కెట్ జన సందోహంతో నిండిపోయింది. రకరకాల చేపలను అమ్మకందారులు తీసుకువచ్చారు. ఒక్కో చేప రకానికి ఒక్కో ధరను నిర్ణయించారు.

మిగతా రోజులతో పోల్చుకుంటే ఈరోజు ధర రెట్టింపు స్థాయిలో ఉన్నది. కొర్రమీను ధర రూ.700లకు కిలో పాత రేటు రూ.500లు కిలో, రవ్ రూ.180, పాత ధర 120, బంగారు తీగ రూ.160, పాత ధర రూ.100, పరకలు రూ.200 పాత ధర రూ.120లుగా పలుకుతున్నాయి.మృగశిర అడుగిడిన తొలిరోజే చేపలు తినడం అనేది ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. దీంతో మార్కెట్‌లో చేపల ధరలు ఆకాశాన్ని తాకాయి. సాధారణ రోజులతో పోలిస్తే వీటిని రెట్టింపు ధరలతో విక్రయించినా ప్రజలు ఎగబడి మరీ కొంటున్నారు.

మృగశిర కార్తెను పురస్కరించుకుని నగరంలో చేపమందు పంపిణీ జరిగేది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా చేపమందు పంపిణీ రద్దయింది. చేపమందు వుంటే ధరలు మరింత ఎక్కువగా వుంటాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో చేపల ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని వినియోగదారులు కోరుతున్నారు. సాధారణ ధర కంటే 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని చేపల మార్కెట్ లో అన్ని కూడా బిజీగా ఉన్నాయి. చేపల కొనుగోలుదారులతో రద్దీ పెరిగిపోయింది. ముషీరాబాద్ తర్వాత బేగంబజార్, మెహిదీపట్నంలలో భౌతిక దూరం లేకుండానే చేపల మార్కెట్ రద్దీగా మారింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle