newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

మూసీన‌ది ప్ర‌క్షాళ‌న దిశ‌గా..!

15-09-201915-09-2019 14:37:40 IST
2019-09-15T09:07:40.033Z15-09-2019 2019-09-15T09:07:31.669Z - - 20-10-2019

మూసీన‌ది ప్ర‌క్షాళ‌న దిశ‌గా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిత్యం కంపుకొడుతూ క‌ళా విహీనంగా మారిన మూసీన‌ది అది త్వ‌ర‌లో  కొత్త రూపును సంత‌రించుకోనుంది. అంతుకు త‌గిన విధంగా తెలంగాణ స‌ర్కార్ మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌కు చ‌ర్య‌లు తీసుకోనుంది. హైద‌రాబాద్ న‌డిబొడ్డు నుంచి ప్ర‌వ‌హిస్తున్న మూసీన‌ది ప్ర‌క్షాళ‌న‌పై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.

ఆక్ర‌మ‌ణ‌ల‌తో కుచించుకుపోయి విష ప‌దార్ధాల‌తో క‌లుషిత‌మైన మూసీ న‌దిని వీలైనంత త్వ‌ర‌గా కాలుష్య కోర‌ల నుంచి కాపాడాల‌ని తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఇదే అంశంపై ఇటీవ‌ల అసెంబ్లీలోని కార్యాల‌యంలో సీఎం కేసీఆర్‌తో శాస‌న స‌భ్యులు, ఉన్న‌తాధికారులు స‌మావేశ‌మై చ‌ర్చించారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో వెలిసిన అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించి వారికి పున‌రావాస క‌ల్ప‌న‌పై చ‌ర్చించారు.

మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దేందుకు సిద్ధం చేసిన ప్ర‌ణాళిక‌లను సీఎంక ఏసీఆర్ ఎమ్మెల్యేల‌కు వివ‌రించారు. ప్ర‌ణాళిక అమ‌లు కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై ఉన్న‌తాధికారుల‌తోపాటు శాస‌న సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు.

మూసీ అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం క‌ట్టుబడి ఉంద‌న్న కేసీఆర్ ఓ స‌మ‌గ్ర పాల‌సీని రూపొందించి అమ‌లు చేద్దామ‌ని ఎమ్మెల్యేల‌తో చెప్పిన‌ట్టు తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే మూసీన‌ది డెవ‌ల‌ప్‌మెంట్‌కు కొత్త బోర్డును నియ‌మించనున్న‌ట్టు స‌మాచారం. ఇదే సంద‌ర్భంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయ‌డంతో ఆ ప్రాజెక్టు ఇప్పుడు టూరిజం స్పాట్‌గా మారిన విష‌యాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

ఇప్ప‌టికే కాళేశ్వ‌రం ప్రాజెక్టును 25 ల‌క్ష‌ల మంది సంద‌ర్శించిన‌ట్టు అధికారిక లెక్క‌లు సైతం చెబుతున్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టు మాదిరిగానే మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌కు యుద్ధ ప్రాతిప‌దిక చ‌ర్య‌లు తీసుకునే ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle