newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూడ్రోజుల్లో పదో తరగతి పాస్ మోమోలు... లక్షమందికి 10 గ్రేడ్ పాయింట్లు

23-06-202023-06-2020 12:19:07 IST
Updated On 23-06-2020 15:02:21 ISTUpdated On 23-06-20202020-06-23T06:49:07.142Z23-06-2020 2020-06-23T06:48:09.607Z - 2020-06-23T09:32:21.144Z - 23-06-2020

మూడ్రోజుల్లో పదో తరగతి పాస్ మోమోలు... లక్షమందికి 10 గ్రేడ్ పాయింట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయిన సంగతి తెలిసిందే. పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన పాస్‌ మెమోలను ఈవారంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. వాటిని ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులు తమ సంతకం చేసి విద్యార్థులకు అందజేస్తారు. ఈ మార్కుల మోమోలతో విద్యార్థులు కాలేజీల్లో చేరవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. ఇక పూర్తి స్థాయి మెమోలను మరో నెల రోజుల్లో పంపించనున్నారు. 

పదో తరగతి విద్యార్థుల గ్రేడ్‌లు, గ్రేడ్‌ పాయింట్స్, గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌తో (జీపీఏ) కూడిన ఫలితాలను సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం అందుబాటులో వుంచింది. విద్యార్ధుల పాస్ మోమోల్లో తేడాలు, పొరపాట్లుంటే కాలేజీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా తెలపాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పొరపాట్ల వివరాలను ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపించి సవరించుకునే అవకాశం ఉంది. ఈఏడాది పరీక్షలు రాసేందుకు నమోదు చేసుకున్న 5,34,909 మంది విద్యార్థులను పాస్‌ చేసి, వారి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్, జీపీఏను కేటాయించారు అధికారులు.

ఈ ఏడాది అనూహ్యంగా లక్షలాదిమంది విద్యార్ధులు 10 జీపీఏ సాధించారు. పదో తరగతి పరీక్షల ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా 1.4 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. సాధారణంగా పరీక్షలు నిర్వహించినప్పుడు 10/10 జీపీఏ రాష్ట్రవ్యాప్తంగా 2,500 మందికి మించి ఎప్పుడూ రాలేదు. 

పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన 5,34,909 మంది విద్యార్థుల్లో దాదాపు 3.74 లక్షల మంది కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులే. వీరిలో ఎక్కువ మందికి పాఠశాలల్లో ఇంటర్నల్‌ మార్కులు 20కి 20 మార్కులు వేసినట్లు సమాచారం. ఇప్పుడు 10/10 జీపీఏ వచ్చిన 1.4 లక్షల మందిలో 98 శాతం మంది కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే. గతంలో కంటే ఇంత ఎక్కువమంది జీపీఏ సాధించడం రాష్ట్రచరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు.  మిగతా జిల్లాల కంటే హైదరాబాద్‌లో10 వేల మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. మొత్తం మీద సరిగా చదవలేనివారు కూడా బంపరాఫర్ కొట్టేశారు.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   14 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle