newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

10-08-202010-08-2020 13:27:38 IST
2020-08-10T07:57:38.573Z10-08-2020 2020-08-10T07:57:32.025Z - - 19-04-2021

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రుతుపవనాలు, తుపాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం నుంచి హైదరాబాద్, నగర శివారు, జిల్లాల్లో వర్షం పడుతోంది. తెలంగాణలో రాబోయే 24గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.  అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది.  ఈ అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహమూబాబాద్‌, ఖమ్మం జిల్లాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది రాత్రికి ఉత్తర ఛత్తీస్ గఢ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా 5.8కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్త నం కొనసాగుతోంది. మధ్య తమిళనాడు పరిసరాల్లో 7.6కి.మీ. ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉదయం నుంచి ఉత్తరాంధ్రలో భారీవర్షా లు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.

విజయనగరంలో 123, నెల్లిమర్ల 60, వంగరలో 58 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం ఉత్తరాంధ్ర, యానాంలలో భారీవర్షాలు కురుస్తాయని, రాయలసీమలోనూ అక్కడక్కడ భారీవర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   27 minutes ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   an hour ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle