ముసురు ముసుగేసిన తెలంగాణ
23-07-202023-07-2020 14:37:08 IST
Updated On 23-07-2020 15:45:17 ISTUpdated On 23-07-20202020-07-23T09:07:08.864Z23-07-2020 2020-07-23T09:07:01.794Z - 2020-07-23T10:15:17.913Z - 23-07-2020

ఈఏడాది తొలకరి నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తతతో ఉండాలని హైదరాబాదులోని వాతావరణశాఖ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో పలు జిల్లాల్లో జూలై 24వ తేదీ వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు వచ్చి చేరుతుందని ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతే కాదు ఈ సమయంలో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపింది. ఇవాళ హైదరాబాదులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాల్సిందిగా అధికారులు చెప్పారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకుండా ఇళ్లకే ప్రజలు పరిమితం కావాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం తమ సిబ్బంది ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు చెప్పారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో వ్యవసాయపనులకు వెళ్లినవారు జాగ్రతగా ఉండాలని వాతావరణ విభాగం పేర్కొంది. ఇదిలా ఉంటే రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ అనే ప్రైవేట్ వాతావరణ సంస్థ తెలిపింది. శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతుందని జోస్యం చెప్పింది. ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాలో తుఫాను ప్రభావం ఉన్నందున ఇక తెలంగాణ మీదుగా విదర్భా వరకు ఉంటుందని చెప్పింది. ఇవాళ ఉదయం నాటికి మెదక్ జిల్లాలోని కుల్చారంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు తుఫాను ప్రభావం ఉంది. ఉత్తర కర్నాటక పరిసరాల్లో కూడా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
5 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
an hour ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
an hour ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
3 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
19 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
20 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా