ములుగులో మావోల అరెస్ట్
05-08-202005-08-2020 09:41:01 IST
Updated On 05-08-2020 10:31:42 ISTUpdated On 05-08-20202020-08-05T04:11:01.961Z05-08-2020 2020-08-05T04:09:56.109Z - 2020-08-05T05:01:42.790Z - 05-08-2020

తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల అలజడి రేగుతోంది. ఇటీవల మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించారు. ఈనేపథ్యంలో పోలీసులు కూంబింగ్ పెంచారు. తాజాగా ములుగు జిల్లాలో మావోయిస్టులు పట్టుబడ్డారు. రివెల్యూషన్ పీపుల్స్ కమిటీకి చెందిన సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 3వ తేదీన కొట్టపల్లి క్రాస్ రోడ్డు వద్ద సాయంత్రం 4.00 గంటల సమయంలో సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలతో పాటు.. వెంకటాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా నడుస్తూ వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా..పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం విచారించగా.. పట్టుబడ్డ వ్యక్తి.. రివెల్యూషన్ పీపుల్స్ కమిటీకి చెందిన సభ్యుడు సోడి వూరా అలియాస్ పురాడుగా నిర్ధారణ అయ్యిందని ములుగు జిల్లా ఎస్పీ తెలిపారు. వూరా 2012లో మావోయిస్టు పార్టీలో చేరినట్లు గుర్తించారు. తొలుత మిలీషియా సభ్యునిగా ఉన్న వురా.. ఆ తర్వాత ఆర్పీసీ సభ్యుడిగా, పూజారికంకర్ ఆర్పీసీ సభ్యుడిగా ఉన్నాడు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
28 minutes ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
7 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
9 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
18-04-2021
ఇంకా