newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు..!

13-01-202013-01-2020 15:46:17 IST
Updated On 13-01-2020 16:05:26 ISTUpdated On 13-01-20202020-01-13T10:16:17.146Z13-01-2020 2020-01-13T10:16:14.951Z - 2020-01-13T10:35:26.173Z - 13-01-2020

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేయాల‌ని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర స‌మితికి ఇప్పుడు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. ప‌లు సున్నిత‌మైన అంశాలు ఇప్పుడు టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇవి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ తీసే అవ‌కాశం ఉందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొన్ని మ‌త‌ప‌ర‌మైన అంశాలు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపితే టీఆర్ఎస్‌కు కొంత న‌ష్టం జ‌ర‌గ‌వ‌చ్చు.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఇందులో క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ స్థానాలు ఓడిపోవ‌డం మాత్రం టీఆర్ఎస్ జీర్ణించుకోలేదు. బీజేపీ అభ్య‌ర్థుల వ్య‌క్తిగ‌త బ‌లంతో పాటు మ‌త‌ప‌ర‌మైన సున్నిత అంశాల్లో టీఆర్ఎస్ కొన్ని త‌ప్పులు చేయ‌డం కూడా బీజేపీకి క‌లిసి వ‌చ్చింద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

ముఖ్యంగా క‌రీంన‌గ‌ర్ ఎంపీగా బీజేపీ నేత బండి సంజ‌య్ గెల‌వ‌డానికి ఎన్నిక‌ల ముందు కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు కూడా కార‌ణ‌మే అనే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు కేసీఆర్‌.. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అనే వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యాల‌ను బీజేపీ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి లాభ‌ప‌డింది.

మ‌జ్లీస్ పార్టీతో టీఆర్ఎస్ స్నేహం కార‌ణంగా ఆ పార్టీ హిందువుల ఓట్లు కొంత మేర కోల్పోయే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌తంలో కాంగ్రెస్ కూడా ఎంఐఎంతో స్నేహం చేసినా హిందువుల ఓట్లు న‌ష్ట‌పోలేదు. టీఆర్ఎస్‌కు కూడా 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితులు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. ఎంఐఎంతో టీఆర్ఎస్ స్నేహాన్ని బీజేపీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటోంది. తెలంగాణ‌లోని మెజారిటీ మున్సిపాలిటీల్లో ముస్లింల ఓట్లు గ‌ణ‌నీయంగా ఉంటాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌హ‌జంగానే ఓటుబ్యాంకు రాజ‌కీయాలు జ‌రుగుతుంటాయి.

ఇదిలా ఉండ‌గా నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన సంఘ‌ట‌న టీఆర్ఎస్‌కు ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉంది. భైంసా ప‌ట్ట‌ణంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన అల్ల‌ర్లు ఎన్నిక‌ల్లో ఎంతోకొంత ప్ర‌భావం చూప‌వ‌చ్చు.

అది భైంసా మున్సిపాలిటీకో, నిర్మల్ జిల్లా వ‌ర‌కో ప‌రిమితం అయితే టీఆర్ఎస్‌కు పెద్ద న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు కానీ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ఎస్ అండ‌తో ఎంఐఎం వారే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డార‌ని బీజేపీ ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లుపెట్టింది. ఇది ఎన్నిక‌ల నాటికి కొన‌సాగ‌వ‌చ్చు.

ఇక‌, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, ఎన్ఆర్‌సీ అంశాలు కూడా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతాయో చూడాల్సి ఉంది. సీఏఏ, ఎన్ఆర్‌సీకి తాము వ్య‌తిరేక‌మ‌ని టీఆర్ఎస్ స్ప‌ష్టంగా ప్ర‌క‌ట‌న చేసింది. అయితే, సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేయాల‌ని ఎంఐఎం స‌హా ముస్లిం సంస్థ‌లు డిమాండ్ చేస్తున్నాయి.

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో సీఏఏకు వ్య‌తిరేకంగా జ‌రిగిన రెండు భారీ ర్యాలీల్లో ముస్లింలు ఈ డిమాండ్‌ను పెద్ద ఎత్తున వినిపించారు. ఇలా సున్నిత మ‌త‌ప‌ర‌మైన అంశాలు ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారాయి. వీటిని జాగ్ర‌త్త‌గా డీల్ చేయ‌క‌పోతే ఆ పార్టీకి న‌ష్టం జ‌ర‌గ‌వ‌చ్చు అనే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle