newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కొత్త టెన్ష‌న్‌..!

02-01-202002-01-2020 07:21:58 IST
Updated On 02-01-2020 15:24:21 ISTUpdated On 02-01-20202020-01-02T01:51:58.469Z02-01-2020 2020-01-02T01:51:49.234Z - 2020-01-02T09:54:21.364Z - 02-01-2020

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కొత్త టెన్ష‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని భావిస్తున్న అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితికి కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల కంటే స్వంత వారితోనే టీఆర్ఎస్‌కు ట్రబ‌ల్స్ ఎదుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రెబ‌ల్స్ బెడ‌ద మున్సిపోల్స్‌లో దెబ్బ‌తీస్తుందా అనే ఆందోళ‌న‌లో టీఆర్ఎస్ అధిష్ఠానం ఉంది. రెబ‌ల్స్ లేకుండా చూడాల్సిన బాధ్య‌త ఎమ్మెల్యేల‌పై పెట్టింది.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కొంత ఎడ్జ్ ఉంటుంది. ఇక‌, తెలంగాణ‌లో ఈ ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ప్ర‌ధాన పార్టీలు కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు బ‌ల‌హీనంగా ఉండ‌ట‌మే అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌ధాన బ‌లంగా మారింది. ఈ విష‌యం జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో నిరూపిత‌మైంది. తెలంగాణ‌లోని మొత్తం 32 జిల్లా ప‌రిష‌త్‌ల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుంది.

ఇదే ఉత్సాహంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ కంటే కూడా టీఆర్ఎస్ ముంద‌స్తు స‌న్నాహాల్లో ఉంది. మంత్రి కేటీఆర్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను తీసుకొని ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌మీక్షలు నిర్వ‌హించారు.

అయితే, టిక్కెట్ల‌కు పోటీ తీవ్రంగా ఉండ‌టం మాత్రం టీఆర్ఎస్‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఎన్నిక‌లు జ‌రుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లోనూ టీఆర్ఎస్ టిక్కెట్ల కోసం ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీలో గాడ్ ఫాద‌ర్ల చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఇక‌, పార్టీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు గ్రూపులు ఉన్నాయి. పార్టీని స్థాపించిన నాటి నుంచి టీఆర్ఎస్‌లో కొన‌సాగుతున్న‌, ఉద్య‌మంలో పాల్గొన్న నేత‌లు ఒక వ‌ర్గంగా ఉన్నారు.

ఇక‌, 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక ఆ పార్టీలోకి వ‌చ్చి చేరిన నేత‌ల సంఖ్య కూడా భారీగానే ఉంది. టిక్కెట్ల విష‌యంలో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య సీనియ‌రిటీ గొడ‌వ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

ఇక‌, 2018 ఎన్నిక‌ల త‌ర్వాత విప‌క్షాల నుంచి ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. వారితో పాటే క్యాడ‌ర్ కూడా టీఆర్ఎస్‌లో చేరింది. ఇలా వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన వారు రెండు గ్రూపులుగా ఉన్నారు. త‌మ అనుచ‌రుల‌కే టిక్కెట్లు కావాల‌ని రెండు వ‌ర్గాల నేత‌లూ ప‌ట్టుబ‌ట్టే అవ‌కాశం ఉంది. ఇదంతా ఇప్పుడు టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా త‌యారైంది.

విప‌క్షాల నుంచి పోటీ కంటే ముందు సొంత వారితోనే పోటీ వ‌స్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. మున్సిప‌ల్ ఎన్నిక‌లు కొన్ని ఓట్ల‌కే ప‌రిమిత‌మై ఉంటాయి. కాబ‌ట్టి, పార్టీల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల్లో కొంత గుర్తింపు, మంచి పేరు ఉన్న వారు ఇండిపెండెంట్‌గానూ ఎక్కువ‌గా గెలుస్తుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ టిక్కెట్ ద‌క్క‌ని వారు ఇలా రెబ‌ల్స్‌గా మారితే పార్టీ అభ్య‌ర్థుల‌కు స‌మ‌స్య‌లు తప్ప‌వు.

అందుకే టీఆర్ఎస్ కూడా అప్ర‌మ‌త్త‌మైంది. టిక్కెట్ ద‌క్కని నేత‌ల‌ను బుజ్జ‌గించే బాధ్య‌త‌ను స్థానిక ఎమ్మెల్యేల‌కు అప్ప‌గించింది. ఎట్టి ప‌రిస్థితుల్లో రెబ‌ల్స్ బెడ‌ద లేకుండా చూడాల‌ని ల‌క్ష్యం పెట్టింది. ఇదే విష‌యాన్ని కేటీఆర్ కూడా బాహాటంగానే అంగీక‌రించారు. బుజ్జ‌గించో, క‌డుపులో త‌ల‌ పెట్టి బ‌తిమాలో రెబ‌ల్స్ లేకుండా చూసుకోవాల‌ని ఆయ‌న ఎమ్మెల్యేల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు.

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

   an hour ago


ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

   13 hours ago


కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

   14 hours ago


 ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

   15 hours ago


కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

   17 hours ago


ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

   18 hours ago


కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

   19 hours ago


కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   21 hours ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   a day ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle