newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

మున్సిపోల్స్‌లో మ‌జ్లీస్ టార్గెట్ పెద్ద‌దే..!

14-01-202014-01-2020 15:09:35 IST
2020-01-14T09:39:35.361Z14-01-2020 2020-01-14T09:34:54.188Z - - 04-08-2020

మున్సిపోల్స్‌లో మ‌జ్లీస్ టార్గెట్ పెద్ద‌దే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేడి రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. అన్ని పార్టీల్లో ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లోనూ జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లానే క్లీన్ స్వీప్ చేసి ప్ర‌తిపక్షాల‌కు కోలుకోలేని షాక్ ఇవ్వాలని అధికార టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంది. ఇక‌, వీలైన‌న్ని ఎక్కువ మున్సిపాలిటీల‌ను కైవ‌సం చేసుకొని తాము బ‌లంగా ఉన్నామ‌ని నిరూపించుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఈ పార్టీల సంగ‌తి ఇలా ఉండ‌గా మ‌జ్లీస్ పార్టీ కూడా మున్సిప‌ల్ ఎన్నిక‌లపై పెద్ద టార్గెట్ పెట్టుకుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప‌ట్టున్న ప్రాంతాల్లో స‌త్తా చాటి పార్టీని పాత‌బ‌స్తీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్త‌రించాల‌ని భావిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ స్నేహ‌హ‌స్తాన్ని ఉప‌యోగించుకొని మున్సిపాలిటీల్లో, మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌లో ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ మేర‌కు ఆ పార్టీ అధినేత, ఎంపీ అస‌దుద్దిన్ ఓవైసీ వ్యూహాలు ప‌న్నుతున్నారు.

ఒక‌ప్పుడు హైద‌రాబాద్‌కు, అందునా కేవ‌లం పాత‌బ‌స్తీకే ప‌రిమిత‌మైన మ‌జ్లీస్ పార్టీ ఇప్పుడు విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బిహార్‌, క‌ర్ణాట‌క త‌దిత‌ర రాష్ట్రాల్లో ముస్లిం జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లోకి ఇప్ప‌టికే విస్త‌రించింది. ఇక‌, తెలంగాణ‌లోనూ త‌మ పార్టీని విస్త‌రించుకునేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఎంఐఎం భావిస్తోంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను ఇందుకు ఉప‌యోగించుకోవాల‌నుకుంటోంది.

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న చాలా మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్‌ల‌లో ముస్లిం జ‌నాభా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపే స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఆయా మున్సిపాలిటీల్లో కొన్ని వార్డుల్లో ముస్లింలే గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యించే స్థాయిలో ఉన్నారు. దీంతో గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనే ఎంఐఎం అనూహ్య ఫ‌లితాలు సాధించింది. నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో 16 స్థానాల‌ను, క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌లో 7 స్థానాల‌ను గెలుచుకుంది.

ఇటీవ‌లి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌లో బీజేపీ అనూహ్య విజ‌యం సాధించింది. దీంతో ఈ రెండు కార్పొరేష‌న్‌ల‌తో పాటు ఈ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని మున్సిపాలిటీలపై ఎంఐఎం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఇక‌, బీజేపీ ఎంపీ ఉన్న అదిలాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలోని ప‌లు మున్సిపాలిటీల్లోనూ ముస్లిం జ‌నాభా అధికంగా ఉంది. ఈ అన్ని మున్సిపాలిటీల్లో స‌త్తా చాటి బీజేపీకి షాక్ ఇవ్వాల‌ని మ‌జ్లీస్ భావిస్తోంది.

ఇక‌, ఉమ్మ‌డి న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ప‌రిధిలోని ప‌లు మున్సిపాలిటీల్లోనూ ముస్లింల జ‌నాభా అధికంగా ఉన్నందున ఈ మున్సిపాలిటీల‌పై మ‌జ్లీస్ క‌న్నేసింది. గ‌తంలో కంటే ఎక్కువ మంది అభ్య‌ర్థుల‌ను నిల‌బెడుతోంది. టీఆర్ఎస్‌తో పొత్తు లాంటిది ఏమీ లేనందున అవ‌కాశం ఉన్నంత వ‌ర‌కు ఎక్కువ వార్డుల్లో ఎంఐఎం అభ్య‌ర్థుల‌ను పోటీలో నిలిపింది. కాగా, త‌మ‌కు బ‌లం ఉన్న చోట టీఆర్ఎస్ నుంచి బ‌ల‌హీన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టించే ప్ర‌య‌త్నాలు కూడా సాగుతున్నాయ‌నే ప్ర‌చారం ఉంది.

పాత‌బ‌స్తీలో ఎంఐఎంవిగా చెప్పుకునే ఏడు అసెంబ్లీ సీట్ల‌లో ఎలాగైతే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ డ‌మ్మీ అభ్య‌ర్థుల‌ను నిలిపింది ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే, ఎంఐఎం ఎన్ని వార్డులు, డివిజ‌న్లు గెలిచినా చివ‌ర‌కు మున్సిప‌ల్ ఛైర్మ‌న్లు, మేయ‌ర్‌ల ఎన్నిక‌లో వారి మ‌ద్ద‌తు టీఆర్ఎస్‌కే ఉండ‌టం ఖాయం. అందుకే టీఆర్ఎస్ కూడా మ‌జ్లీస్ ప‌ట్ల సానుకూలంగానే వెళుతోంది. మ‌రి, మ‌జ్లీస్ ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెలంగాణ అంత‌టికి విస్త‌రిస్తుందా, లేదా చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle