newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

మున్సిపోల్స్‌కు ల్లైన్‌ క్లియర్‌.. ప్రభుత్వం ఆలోచనేంటి?

22-10-201922-10-2019 17:14:16 IST
2019-10-22T11:44:16.199Z22-10-2019 2019-10-22T11:44:12.541Z - - 22-09-2020

మున్సిపోల్స్‌కు ల్లైన్‌ క్లియర్‌.. ప్రభుత్వం ఆలోచనేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వార్డుల విభజన, ఓటరు లిస్టులో అక్రమాలు, రిజర్వేషన్‌ల అంశంపై దాఖలైన పిటీషన్‌లను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అండంకులు తొలగినట్లయింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందా అనేదానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తోడు ప్రజల్లో వ్యతిరేఖత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తక్షణమే మున్సిపల్‌ ఎన్నికలు జరిగేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. ఈ మేరకు ఆగస్టులో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, సుదీర్ఘంగా కోర్టుల్లో ఉన్న కేసులు, వాదనల కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు. అప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టుతీర్పు ప్రకారం 53మున్సిపాల్టిdలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, 75 మున్సిపాల్టిల విషయంలో మాత్రం స్టే తొలిగిస్తేనే ఎన్నికలు సాధ్యం అవుతుంది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా న్యాయ పరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. స్టే తొలిగించిన తరువాత మొత్తంగా 128 మున్సిపాల్టిdలకు కలిసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మిగిలిన న్యాయ ప్రక్రియ పూర్తిచేసి ప్రభుత్వం ఎన్నికలకు సిద్దం అవుతుందా లేదా అనే ఆసక్తి రాజకీయ పార్టీల్లో మొదలైంది. తాజాగా హుజూర్‌ నగర్‌ ఉపఎన్నిక విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా పోరాటం చేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపని చెప్పినప్పటికీ టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు ఉద్యోగ సంఘాల్లోని సంగానికిసైతం ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు తెలుస్తోంది.

దీనికితోడు ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయకుండా సీఎం కేసీఆర్‌ మొండితనంతో ముందుకెళ్తుండటం, తద్వారా రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజల్లోనూ కేసీఆర్‌ మొండివైఖరిపై వ్యతిరేఖత వ్యక్తమవుతుంది. మరోవైపు కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఇలాంటి సమయంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తే మొదటికే చేటు వస్తుందని సీఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహించకుండా.. సమస్యలన్నీ పరిష్కారమై పరిస్థితులు చక్కబడిన తరువాత మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించుకుంటే మంచిదని సీఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఎప్పుడూ ప్రత్యర్థులు, రాజకీయ విశ్లేషకుల ఊహలకు అందని నిర్ణయాలు తీసుకొనే సీఎం కేసీఆర్‌.. మున్సిపల్‌ ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle