newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మున్సి'పోరు'లో జాడలేని కేసీఆర్ కూతురు కవిత!

12-01-202012-01-2020 13:50:55 IST
Updated On 13-01-2020 11:49:30 ISTUpdated On 13-01-20202020-01-12T08:20:55.481Z12-01-2020 2020-01-12T08:20:24.676Z - 2020-01-13T06:19:30.234Z - 13-01-2020

మున్సి'పోరు'లో జాడలేని కేసీఆర్ కూతురు కవిత!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుని మించి బతుకమ్మ పండగ బ్రాండ్ అంబాసిడర్ గానే ఎక్కువగా తెలంగాణ ప్రజలకి చేరువయ్యారు. బతుకమ్మ పండగను అంతర్జాతీయ స్థాయిలో సెలెబ్రేట్ చేసేందుకు కవిత తన వంతుగా ప్రయత్నాలను చేయడంతో కొంతవరకు విజయం సాధించారు. అయితే, నిజామాబాద్ ఎంపీగా ఓటమి తర్వాత ఆ బతుకమ్మ పండగలో కూడా యాక్టివ్ గా లేకుండా ఉండిపోయారు.

సీఎం కూతురుగా.. బతుకమ్మ పండగ పెద్దదిక్కుగా ఆడపడుచులకు గుర్తొచ్చే కవిత పార్లమెంట్ ఎన్నికలలో సీనియర్ నేత డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక అప్పటి నుండి పార్టీ సమావేశాల దగ్గర నుండి.. నిజామాబాద్ రాజకీయాలలో కూడా ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే, ఎప్పటికప్పుడు కవిత త్వరలోనే యాక్టివ్ అవుతారని ఊహాగానాలు మాత్రం వినిపించేవి.

అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కవిత ఒక మాట అనేవారు. తాను ఎన్నికలలో గెలిచినా.. ఓడినా ఇందూరు కోడలిగా ఇక్కడ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అనేవారు. కానీ ఎంపీగా ఓడిన అనంతరం జాడలేకుండా పోయారు. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు మరోసారి తెరాస వర్గాలు ఆనాటి మాటలను గుర్తు చేసుకుంటున్నారు.

నిజానికి ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కవిత ప్రచారం చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి పసుపు రైతులకు ఎంపీ అరవింద్ ఎన్నికల సమయంలో స్టాంప్ పేపర్ మీద పసుపు బోర్డు తీసుకొస్తానని హామీఇచ్చి మరీ గెలిచారు. కానీ పసుపు బోర్డు మాత్రం ఇప్పటికీ రాలేదు. అక్కడ ప్రధాన పోటీ కూడా బీజేపీ-తెరాస మధ్యనే ఉంటుంది.

ఈ క్రమంలో కవిత కూడా ప్రచారానికి వస్తే మరికొంత పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే మున్సిపల్ బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేల నెత్తిన పెట్టేశారు. నిజామాబాద్ మొత్తం అరవై స్థానాలు కాగా ముగ్గురు ఎమ్మెల్యేల పరిధిలో ఉంది. ఎమ్మెల్యే గణేష్ గుప్తా పరిధిలో యాభై.. బాజిరెడ్డి పరిధిలో ఎనిమిది.. జీవన్ రెడ్డి పరిధిలో మరో రెండు స్థానాలు ఉన్నాయి. ఈ ముగ్గురు ఇప్పుడు శాయశక్తులా పనిచేస్తున్నారు.

ఈ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పుడు ఇక్కడ తెరాస గెలిస్తే పార్లెమెంట్ సమయంలో బీజేపీ గెలుపు గాలివాటం మాత్రమేనని సంకేతాలివ్వాలని తెరాస ఆరాటపడుతుంటే .. మరోసారి బీజేపీ జెండా ఎగరేసి నిజామాబాద్ కషాయానికి కంచుకోట అని నిరూపించుకోవాలి ఎంపీ అరవింద్ ఆశపడుతున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు తోడు మాజీ ఎంపీ కవిత ప్రచారం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యేలు ఆశపడుతున్నారు. అయితే కవిత ప్రచారం చేసినా తెరాస మరోసారి ఓటమి పాలైతే కవిత రాజకీయ జీవితానికి ఇంకా నష్టంగా మారే అవకాశం ఉందని మరో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో ఇందూరు కోడలు కవిత మరోసారి ప్రచార బాధ్యతలు తీసుకుంటారా? అన్నది అనుమానమే అనిపిస్తుంది.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle