newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మున్సిపల్ తర్వాత ప్రభుత్వంపై రేవంత్ మార్క్ ఫైట్?

19-01-202019-01-2020 16:18:51 IST
Updated On 20-01-2020 11:55:14 ISTUpdated On 20-01-20202020-01-19T10:48:51.985Z19-01-2020 2020-01-19T10:48:44.186Z - 2020-01-20T06:25:14.889Z - 20-01-2020

మున్సిపల్ తర్వాత ప్రభుత్వంపై రేవంత్ మార్క్ ఫైట్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం తెలంగాణలో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. అప్పే చేస్తున్నారో.. వచ్చే ఆదాయం పంచి పెడుతున్నారో కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజలలో బలంగా నాటుకుపోతుంది. ఒకపక్క సంక్షేమం.. మరోపక్క రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలతో ప్రభుత్వం దూసుకుపోతుంది. మరోవైపు గులాబీ అధినేత తన ఎత్తుగడలతో విపక్ష పార్టీలకు ఉనికి లేకుండా చేస్తున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నిజం. కాళేశ్వరం వంటి మహా ప్రాజెక్టులను కేంద్రం సహకారం లేకుండా నిర్మించడం.. అందుకు వచ్చే విద్యుత్ బిల్లుల మోత వంటివి రాష్ట్రానికి తలకు మించిన భారమే. పైగా రైతు బంధు బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే కనిపించే రాష్ట్రాభివృద్ధి ముందు అవి తేలిపోతున్నాయి.

ఈక్రమంలోనే టీఆర్ఎస్ పరిపాలన పూలపాన్పుగా మారింది. మరి ప్రభుత్వంపై అసంతృప్తులు లేవా అంటే గట్టిగానే ఉన్నాయి. ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా అందలేదు.. నిరుద్యోగ భృతి ఊసేలేదు.. ఇంటికో ఉద్యోగం రానేలేదు..దళితులకు సీఎం పదవి లేదు, మూడెకరాల భూమిలేదు.. ఇప్పటికీ భగీరథ నీళ్లు అందలేదు.. కాళేశ్వరం చేసిన ఖర్చుకి, ఇచ్చే నీళ్లకి పొంతనలేదు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి.

వీటన్నింటిపై ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రతిపక్షమే బలంగా లేదు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఓటమి.. పంచాయతీలు.. పార్లమెంట్ ఇలా వరస ఓటమితో డీలా పడడమే కాక.. ఓటమికి కారణంలో ఒకరిపై మరొకరు నిందలు.. ఆధిపత్యాలతోనే సరిపెట్టుకుంది. ఈక్రమంలో కాంగ్రెస్ ప్రక్షాళనకి హైకమాండ్ పూనుకుంది. ఇప్పటికే కొత్త పిసిసి అధ్యక్షుడు ఖరారయ్యారని ప్రచారం జరుగుతుండగా మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రకటన ఉంటుందంటున్నారు.

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నూతన పిసిసి అధ్యక్షుడిగా ఖరారయ్యారని పార్టీ వర్గాలలో వినిపిస్తుండగా ఫిబ్రవరి నుండి రేవంత్ మార్క్ పోరాటం మొదలు కాబోతుందని చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట, హైదరాబాద్లో సొంత ఆఫీస్ ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించినప్పుడు ఇదే మాట చెప్పారు. కానీ అది సైలెంట్ గానే ఉన్నారు. గత నెలలోనే ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన భారత్ బచావో కార్యక్రమంలో కూడా ఇలాంటి ప్రకటనే చేశారు.

కానీ అది కూడా నిజం కాలేదు. ఈసారి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అదే మాట చెప్తున్నారు. అయితే ఈసారి కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే, వచ్చే నెలలో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించనున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం సీనియర్ నేతలతో ఉన్న గ్రూపు తగాదాలతో వెనక్కు తగ్గుతున్న రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా చెలరేగే అవకాశం ఉందని చెప్తున్నారు.

ఆరేళ్ళ కెసిఆర్ పాలనలో బడా కంపెనీలకి ఇచ్చిన కాంట్రాక్టుల దగ్గర నుండి ఆరేళ్ళలో పెరిగిన కుటుంబ ఆస్తుల వరకు ఆధారాలతో పోరాటానికి రేవంత్ సిద్ధమయ్యారని సన్నిహితులు చెప్తున్నారు. నిజానికి చప్పగా మారిన తెలంగాణ రాజకీయాలలో రేవంత్ అందుకొనే కాంగ్రెస్ పగ్గాలతో ఊపురావడం ఖాయమంటున్నారు. మరి ఇది ఎంతవరకు ఆచరణ అవుతుందో చూడాల్సి ఉంది.

 

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle