newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం

20-12-201920-12-2019 10:08:10 IST
Updated On 20-12-2019 10:23:15 ISTUpdated On 20-12-20192019-12-20T04:38:10.442Z20-12-2019 2019-12-20T04:38:01.458Z - 2019-12-20T04:53:15.341Z - 20-12-2019

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. టీపీసీసీ కోర్‌ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంది. అలాగే ‘పౌరసత్వ సవరణ’కు వ్యతిరేకంగా మున్సిపాలిటీల్లో నిరసనలు తెలపనుంది. రాష్ట్రంలో 50 శాతానికిపైగా పురపాలక చైర్మన్లు, కౌన్సిలర్ల స్థానాలు దక్కించుకోవాలని, అందుకు అనుగుణంగా అంతా కలిసి పనిచేయాలని నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో కోర్‌ కమిటీ భేటీ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌ చార్జి ఆర్‌సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమకుమార్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, శశిధర్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌ కృష్ణన్, చిన్నారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చ జరిగింది. అలాగే పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాణి వినిపించాలని సమావేశంలో తీర్మానించారు. రెండవసారి సీఎం అయిన కేసీయార్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను రాజకీయంగా సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.

కోర్ కమిటీ భేటీకి పలువురు నేతలు డుమ్మా కొట్టడం విశేషం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ తదితర నేతలు సమావేశానికి దూరంగా ఉన్నారు.

సీఏఏపై ఈ నెల 27 వరకూ ఆందోళనలు నిర్వహించనుంది కాంగ్రెస్. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల తన పేరు తాను ప్రకటించుకోవడంతో నవ్వులు పూశాయి. పొన్నాల పేరుని ప్రకటించకపోయిన.. ఉత్తమ్ తాను చేసిన పొరపాటును ఒప్పుకున్నారు. మనిసిపల్ ఎన్నికలపై టీపీసీసీ వ్యూహం ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle