newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

మున్సి'పల్స్' బాధ్యత కమిటీలకిచ్చిన టీఆర్ఎస్..!

28-12-201928-12-2019 13:44:55 IST
2019-12-28T08:14:55.108Z28-12-2019 2019-12-28T08:14:53.040Z - - 25-10-2020

మున్సి'పల్స్' బాధ్యత కమిటీలకిచ్చిన టీఆర్ఎస్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆరు నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మునిసిపల్ ఎన్నికలు రానే వచ్చాయి. రిజర్వేషన్లు, కోర్టు సమస్యల అనంతరం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఆశావాహలు మరోసారి తెలంగాణ భవన్ కు క్యూకట్టారు. ఈసీ షెడ్యూల్ ప్రకటించిందో లేదో తెలంగాణ భవన్ కు తాకిడి పెరిగింది. మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేతలు పెద్దల వద్ద ప్రపోజల్స్ పెట్టేస్తున్నారు.

ఇందులో ఉద్యమ కాలం నుండి పార్టీలో ఉన్న నేతలు కొందరైతే గత ప్రభుత్వం సమయంలో నుండి రెండోసారి ఈ ఏడాది కాలంలో పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరికీ టికెట్లు కేటాయించడం కుదరదు. కనుక ఇప్పటికే వడపోత కార్యక్రమంపై అధిష్టానం దృష్టి పెట్టింది. తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టారు.

ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో పార్టీ ముఖ్యులతో సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారట. మున్సిపల్స్ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపై ఓ త్రిసభ్య కమిటీని నియమించనున్నట్లు తెలుస్తుంది. ఈ కమిటీ క్షేత్ర స్థాయి నుండి పార్టీ శ్రేణులతో సమావేశమై జిల్లా పార్టీ అధ్యక్షులను సమన్వయం చేసుకుంటూ జిల్లాల వారీగా జాబితాలను సిద్ధం చేసి అధిష్టానానికి అందించనుందట.

అధిష్టానానికి అందిన అభ్యర్థుల జాబితాను కూడా ఒక్క కేటీఆర్ లేదా సీఎం కెసిఆర్ మాత్రమే నిర్ణయం తీసుకోకుండా మరోసారి త్రిసభ్య కమిటీతో చర్చలు జరిపి ఓ తుది జాబితాను సిద్ధం చేసి చివరిగా సీఎం కెసిఆర్ వద్దకు జాబితాలు వెళ్లనున్నాయట. మొత్తం మూడు లేదా నాలుగు దశలలో ఈ ప్రక్రియ కొనసాగేలా కేటీఆర్ ప్రణాళికలు గీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టికెట్లను ఆసిస్తూ తమ వద్దకు వచ్చే నేతలకు కూడా కేటీఆర్ ఇదే విషయాన్ని చెబుతున్నారట. మీలో సత్తా ఉండి.. మీ అవసరం ప్రజలకు, పార్టీకి ఉందనిపిస్తే మీకే టికెట్ దక్కుతుందని చెబుతున్నారట. టికెట్లు దక్కనివాళ్ళు అసంతృప్తి చెందాల్సిన అవసరంలేదని.. ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందని.. అందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారట.

మొత్తం మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థుల పల్స్ పట్టుకొనేందుకు తెరాస ఓ కమిటీని రంగంలోకి దించనున్నారన్నమాట. అయితే ఈ కమిటీలో ఉండే నేతలెవరు అన్నది ఇంకా తేలలేదు. అభ్యర్థుల ఎంపిక పక్కా ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగానే ఉన్నా ఫలితాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. అన్నట్లు అసంతృప్తులను బుజ్జగించేందుకు కూడా మరో కమిటీ వేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందేమో చూడాలి!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle