newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

మున్సిపల్స్‌పై కేసీఆర్‌ ప్రయోగించిన రైతు బంధు ఆయుధం!

21-01-202021-01-2020 09:54:22 IST
2020-01-21T04:24:22.578Z21-01-2020 2020-01-21T04:24:18.385Z - - 22-02-2020

మున్సిపల్స్‌పై కేసీఆర్‌ ప్రయోగించిన రైతు బంధు ఆయుధం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మరో అంకం ముగిసింది. సోమవారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఇక మిగిలింది ఎన్నికల ప్రక్రియ, ఫలితాలు మాత్రమే. ఈనెల 22న ఎన్నికలు జరగనుండగా 25న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, గత నెల రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ మాటల యుద్దానికి దిగి ప్రచారాన్ని హోరెత్తించాయి.

ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వ హామీలు.. ప్రభుత్వ అసంతృప్తిని టార్గెట్ చేస్తూ ప్రచార బాణాలు సాధించగా అధికార పార్టీ ఒకవైపు తమ హయంలో జరిగిన సంక్షేమంతో పాటు మున్సిపాలిటీ, నగర పాలక సంస్థలతో జరిగిన అభివృద్ధిని చెప్పుకుంటూ ముందుకు సాగింది. ఇక ప్రభుత్వం పలుచోట్ల ఈసీ ఉల్లంఘనకు దిగి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టింది.

సీఎం కేసీఆర్ మున్సిపల్ బాధ్యతను మంత్రుల భుజాలపై పెట్టడంతో మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. షెడ్యూల్.. నోటిఫికేషన్ మధ్య పల్లెప్రగతితో నిత్యం ప్రజల మధ్యకు వెళ్లిన మంత్రులు గత రెండు వారాలుగా రోడ్ షోలు నిర్వహించి గల్లీ గల్లీ తిరిగారు. ఇక సోమవారం సాయంత్రం ప్రచారం ముగియగా అదే సోమవారం సాయంత్రం ప్రభుత్వం రైతు బంధు డబ్బులు విడుదల చేసింది.

రైతుబంధు పథకంలో భాగంగా రబీ పంటకు రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ నగదు అందించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ కూడా వెంటనే పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక, నిధుల మంజూరుకు సంబంధించి పరిపాలనా అనుమతులు కూడా రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థిక శాఖకు అందించనుంది. ఈ వివరాలు అందిన వెంటనే ఆర్థిక శాఖ సదరు నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అంటే సుమారుగా ఈ వారంలో ఈ నగదు రైతులకు చేరనుంది. వీలైతే మున్సిపల్ ఎన్నికల రోజుకే చేరినా ఆశ్చర్యంలేదు.

తాజా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు రైతు బంధు, రైతు రుణ మాఫీ నిధులనే ప్రధానాస్త్రంగా చేసుకొని విమర్శలు గుప్పించాయి. రుణమాఫీ సంగతెలా ఉన్నా ప్రభుత్వం రైతు బంధు నగదును మాత్రం ఎన్నికల అస్త్రంగా ఎన్నికలకు ముందే విడుదల చేయడం గమనార్హం. మరి ఇది అధికార పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిఉంది.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle