మునిసిపోల్స్.. మళ్ళీ గులాబీ జెండా ఖాయమా?
28-12-201928-12-2019 08:30:55 IST
Updated On 28-12-2019 10:37:55 ISTUpdated On 28-12-20192019-12-28T03:00:55.595Z28-12-2019 2019-12-28T03:00:39.210Z - 2019-12-28T05:07:55.159Z - 28-12-2019

తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తూ వుంటుంది. తాజాగా జరగనున్న మునిసిపల్ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. గత ఏడాది డిసెంబరులో శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి మళ్ళీ రెండోసారి అధికారం కైవసం చేసుకుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు... అనంతరం లోక్ సభ ఎన్నికలు జరిగాయి. లోక్ సభ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగేలేకుండా పోయింది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ వ్యూహరచనతో ముందుకెళుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ సమావేశం నిర్వహించింది. అన్ని జిల్లాల్లో గ్రూపు తగాదాలు లేకుండా ముందుకు వెళ్లాలని కేటీయార్ సూచించారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంతో ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్ర కమిటీనేతలు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. మునిసిపల్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే విధంగా నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరగడంతో అభ్యర్ధులు బాగా పెరిగారు. సమర్ధులైన అభ్యర్థుల ఎంపిక క్లిష్టమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసంతృప్తులు పెరగకుండా, అందరూ కలిసి పని చేసేలా ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికలు ముగిస్తే ఇక తెలంగాణలో ఎన్నికలే వుండవు. మరో నాలుగేళ్ళు పాలనపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
8 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
11 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
15 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
13 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా