newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

మునిసిపోల్స్... బీజేపీ నేతల హాట్ కామెంట్స్

17-01-202017-01-2020 16:28:48 IST
Updated On 17-01-2020 16:29:07 ISTUpdated On 17-01-20202020-01-17T10:58:48.289Z17-01-2020 2020-01-17T10:58:42.689Z - 2020-01-17T10:59:07.240Z - 17-01-2020

మునిసిపోల్స్... బీజేపీ నేతల హాట్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను ఎంపీ ధర్మపురి అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అరవింద్ సంచలన కామెంట్లు చేశారు.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో గెలుపొంది.. మేయర్‌ పదవిని చేపడితే.. మొదట నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. 

నిజామాబాద్‌ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తామని, పట్టణంలో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. బీజేపీ గెలుపొందితే నిజామాబాద్‌ పట్టణం చుట్టూ  ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని మరో కీలక హామీ ఇచ్చింది.

ఇటు గోషామహల్ ‌ఎమ్మెల్యే రాజాసింగ్ భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌‌లోని ఎంఐఎం కార్పొరేటర్లు నా బామ్మర్దులే అని అన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం దోస్తీతో ప్రజలకు ఇబ్బందులొస్తాయని, అది గమనించాలన్నారు. 

భూపాలపల్లి మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని రాజాసింగ్ కోరారు. టీఆర్‌ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి జరగదన్నారు. ప్రతి ఇంటికీ మంచినీళ్లు ఇస్తామని, నీళ్ళు రాకుంటే ఓట్లు అడగబోనని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని రాజాసింగ్ అన్నారు.  చలో బైంసా పిలుపు నేపథ్యంలో రెండురోజుల క్రితమే రాజాసింగ్ ను గృహనిర్బంధంలో వుంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మళ్లీ ఎన్నికల ప్రచారం పేరుతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   43 minutes ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle