మునిసిపోల్స్ తర్వాత కేటీయార్కు పట్టాభిషేకం?
31-12-201931-12-2019 14:00:25 IST
Updated On 31-12-2019 15:04:03 ISTUpdated On 31-12-20192019-12-31T08:30:25.682Z31-12-2019 2019-12-31T08:30:21.508Z - 2019-12-31T09:34:03.295Z - 31-12-2019

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కెసిఆర్ తర్వాత స్థానం ఎవరిది అంటే ఇప్పుడు దాదాపు స్పష్టమైన సమాధానాలు వచ్చేస్తున్నాయి. ఆ మధ్య ఎన్నికల సమయంలో పార్టీ నేతలను కెసిఆర్ తర్వాత హరీష్ రావా.. కేటీఅరా.. అన్న ప్రశ్నలు అడిగితే లెక్కలేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ నేతల మధ్య స్పష్టంగా కేటీఆర్ మాత్రమేనని తడుముకోకుండా సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే సీఎం కెసిఆర్ కుమారుడిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి బాధ్యతలను అప్పగించేసిన సంగతి తెలిసిందే. కాగా, అప్పటి నుండి పార్టీ నేతలు కూడా కెసిఆర్ దగ్గరకు వెళ్లాల్సిన విషయాలను ముందుగా కేటీఆర్ వద్దకే తీసుకెళ్తున్నారని పార్టీలో వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మంత్రులు అయితే కేటీఆర్ సారథ్యంలోనే తమ పరిపాలన అని బాహాకటంగానే చెప్పేస్తున్నారు. ఇక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కూడా పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో టీడీపీ అనుసరించిన గ్రామస్థాయి నుండి పార్టీ నిర్ణయాత్మక వ్యవస్థలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీలో క్రియాశీలకంను మించి నిర్ణయాత్మక శక్తిగా కేటీఆర్ ఎదిగిపోయారన్నది స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యమే. ఇక మిగిలింది.. ప్రభుత్వ పగ్గాలు. ఆ మధ్య ఎన్నికల సమయంలో కెసిఆర్ కేంద్ర రాజకీయాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుకున్నట్లు జరిగిఉంటే ఈ పాటికే కేటీఆర్ చేతికి పరిపాలనా యంత్రాంగం వీల్లేదని చెప్తారు. కేంద్రంలో అప్పుడు బీజేపీ ఫలితాలతో కేటీఆర్ ఇక్కడ మంత్రి అయిపోయారు. కాగా ఇప్పుడు కెసిఆర్ మరోసారి జాతీయ రాజకీయాలవైపు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదని ప్రచారం మొదలైంది. ఆ ప్రచారం కారణంగానే మంత్రులు బహిరంగంగా కేటీఆర్ మా నేత అని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ కు రాష్ట్ర పరిపాలనా పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అందులో భాగమే మున్సిపల్ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ భుజాలపై వేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఎన్నికలలో తెరాస విజయ పరంపర కొనసాగిస్తే ప్రజలు మెచ్చిన నాయకత్వం అని చెప్పుకునేందుకు సరైన వేదికగా కేసీఆర్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకనాటి ఉద్యమం సమయం నుండి మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల వరకు ఎన్నికల ఫలితాలను కూడా తర్వాత ఎన్నికల కోసం వాడుకొనే అంశంలో కెసిఆర్ సిద్ధహస్తుడు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఫలితాలను వాడుకొని పాలన పగ్గాలు కేటీఆర్ కి అప్పగించినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి ఇప్పుడే అంతటి నిర్ణయం తీసుకుంటారా? లేక కేటీఆర్ ను గొప్ప నాయకుడిగా ప్రాజెక్ట్ చేసుకొనేందుకు మాత్రమే ఉపయోగించుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
7 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
21 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021
ఇంకా