మునిసిపోల్స్ కోసం ‘డబుల్’ డ్రామా
19-09-202019-09-2020 17:30:52 IST
2020-09-19T12:00:52.818Z19-09-2020 2020-09-19T12:00:27.754Z - - 14-04-2021

ఇప్పుడు భాగ్య నగరంలో అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్ లు ‘డబుల్’ డ్రామాకు తెరలేపాయి. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ఈ ఐదేళ్లుగా కమ్మనని పార్టీలు ఇప్పుడు వాటి చుట్టూ రాజకీయ నాటకానికి తెరతీశాయి. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్ లు తమతమ రాజకీయ విమర్శలకు పదును పెడుతున్నాయి. విశ్వనగరం హైదరాబాద్ రహదారుల దుస్థితి గురించికానీ, నోళ్లు తెరుచుకున్న మ్యాన్ హోల్స్ మింగేస్తున్న ప్రాణాల గురించి కానీ ఈ డ్రామాలో కనీసంగా కూడా ప్రస్తావించడం లేదు. ఇరు పార్టీల దృష్టీ డబుల్ బెడ్ రూం ఇళ్ల పైనే కేంద్రీకరించాయి. గత ఐదేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇళ్లతో పేదలకు సొంతింటి కల నిజం చేస్తానంటూ చెబుతున్న సర్కార్ ఇప్పుడు హఠాత్తుగా జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయంటూ చేసిన ప్రకటన ఎన్నికల నేపథ్యంలో చేసినదేనని భావించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీలో పట్టు కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ వెంటనే లక్ష ఇళ్లు ఎక్కడున్నాయంటూ సవాల్ విసరడానికీ అదే కారణం. ఇలా సవాళ్లు ప్రతిసవాళ్లతో మీడియా సమావేశాల హడావుడికి భిన్నంగా ఇరు పార్టీలూ కలిసి పరిశీలన అంటూ కొత్త ఒరవడికి నాంది పలికాయి. అయితే...అక్కడా రాజకీయ విమర్శలకే ఈ పరిశీలన కార్యక్రమం పరిమితమైపోవడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు. తొలి రోజు పర్యటనలో మూడు వేల పైచిలుకు ఇళ్లను పరిశీలించే వరకూ అంతా సజావుగానే సాగింది. అయితే రెండో రోజు మాత్రం వికటించింది. గ్రేటర్ పరిధిలో కాకుండా జిల్లాల్లో తిప్పుతున్నారనీ, అక్కడి డబుల్ ఇళ్లు చూపుతున్నారనీ భట్టి చేసిన విమర్శతో కలిసికట్టు పర్యటనలకు బ్రేక్ పడింది. ఇక డబుల్ ఇళ్ల వ్యవహారమే జీహెచ్ఎంసీ ఎన్నికల అజెండాగా ఇరు పార్టీలకూ కూడా మారనుందన్న సంగతి స్పష్టమైంది. అధికార పార్టీకి కావలసింది ఇదే...డబుల్ ఇళ్ల చుట్టూనే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం అంతా కేంద్రీకృతమైతే...ఇతర కీలక సమస్యల నుంచి జనం దృష్టిని మరల్చడానికి వీలౌతుందన్నదే తెరాస వ్యూహరచనగా కనిపిస్తున్నది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అధికార పార్టీ వ్యూహంలో కాంగ్రెస్ చిక్కుకున్నదనే భావించాల్సి ఉంది. అధికార పక్ష వైఫల్యాలను ఎత్తి చూపే విషయంలో కాంగ్రెస్ లో సమష్టితత్వం లోపించడం తెరాసకు వరంగా మారిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఇరు పార్టీలూ గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే... ప్రచార వ్యూహాలు, సన్నద్ధత విషయంలో అధికార తెరాస ఒక రెండడుగుల ముందు ఉన్నట్లు కనిపిస్తున్నది. గ్రేటర్ ఎన్నికల విజయమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులతో పలు దఫాలు చర్చలు జరిపి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ లో ఇంకా అది మొదలైనట్లు కనినపించదు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
5 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
6 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
9 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
12 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
7 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా