మునిసిపోల్స్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా
23-01-202023-01-2020 18:33:32 IST
2020-01-23T13:03:32.496Z23-01-2020 2020-01-23T13:03:27.616Z - - 16-04-2021

తెలంగాణలో కరీంనగర్ మినహా అన్ని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లలో కీలకమయిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్ట మొదటి మున్సిపల్ ఎన్నికలు చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తమదే గెలుపని, అందులో అనుమానాలు అక్కర్లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమాతో వున్నారు. అధికంగా పోలింగ్ జరిగిందని, అందుకు ప్రజలు తమ ప్రభుత్వం పట్ల సానకూల వైఖరికి పోలింగ్ నిదర్శనం అన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లు బ్రహ్మాండంగా స్పందించారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకంతో ఓటు వేశారని.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో 90శాతం సీట్లు టీఆర్ఎస్ కారుకే చెందుతాయన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తోందని, అదే సంస్కృతి మళ్లీ రిపీట్ అవుతుందంటున్నారు. దావోస్ సదస్సుకు వెళ్లినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్ ఎన్నికల గురించే వాకబు చేశారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ ఎజెండాకు… మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పని తీరుకు మంచి బహుమతి లభించబోతుందన్నారు. 24న జరగబోయే కరీంనగర్ కార్పొరేషన్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని తెలిపారు. ఈ ఎన్నికల్లో అధిక పోలింగ్ జరిగేలా కార్యకర్తలు కృషిచేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు భంగపాటు తప్పదన్నారు. మరోవైపు మున్సిపల్ మేయర్లు, ఛైర్పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జనవరి 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి 27వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని ఎస్ఈసీ తెలిపింది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా