newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మునిసిపల్ సదస్సులో కేసీయార్ దిశానిర్దేశం

19-02-202019-02-2020 08:33:35 IST
2020-02-19T03:03:35.989Z19-02-2020 2020-02-19T03:03:24.694Z - - 16-04-2021

మునిసిపల్ సదస్సులో కేసీయార్ దిశానిర్దేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. అసెంబ్లీ నుంచి స్థానిక సంస్థల వరకూ అన్ని ఎన్నికలు ముగిసి ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీయార్ మునిసిపల్ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. తమ పరిధిలోని వివిధ ప్రధాన సమస్యలను పరిష్కరించకుంటే తప్పుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు కేసీయార్. 

3 నెలల్లో పట్టణాలు, నగరాల్లో టాయిలెట్లు నిర్మించాలని లేదంటే ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు పదవుల నుంచి తప్పుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. పట్టణాలకు ప్రతి నెలా రూ 148 కోట్ల ఆర్థిక సంఘం నిధులు ఇస్తామన్నారు.. పట్టణ ప్రగతి నిర్వహణపై ప్రగతి భవన్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ సదస్సులో సీఎం కేసీఆర్‌ వివిధ అంశాలను ప్రస్తావించారు.

శాసనసభ్యులు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతిని నిర్వహించాల్సిన తీరుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు వార్డులవారీగా పట్టణ ప్రగతి ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలన్నారు. 

గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల లేమి ఉందని, ప్రణాళికాబద్ధంగా ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు అభివృద్ది సాధిస్తాయన్నారు. ప్రజాప్రతినిధులు ఫోటోలకు పరిమితం కావద్దని చురకలంటించారు. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారాన్ని కలెక్టర్లకు కల్పించారు. వీధి వ్యాపారుల కోసం పట్టణాల్లో స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్ల ఏర్పాటుచేయనున్నారు. అంతేకాదు, ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజారవాణా, సరుకు రవాణా వాహనాలకు నిర్దిష్ట ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటుచేయనున్నారు.

Image

దీంతోపాటు, సంపూర్ణ అక్షరాస్యత కోసం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు సూక్తులను ఉటంకించారు. ఒకసారి తాము ఎన్నుకున్న నాయకుడి మీద విశ్వాసం కలిగితే ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. సంకల్పం గట్టిగా ఉంటే 100 శాతం విజయం సాధిస్తామన్నారు సీఎం కేసీయార్. మొత్తం మీద కేసీయార్ మునిసిపల్ ప్రజాప్రతినిధుల కర్తవ్యాలను మరోసారి గుర్తుచేశారు. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle