newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

మునిసిపల్ రిజర్వేషన్లు షురూ.. కోర్టుకెళతామన్న కాంగ్రెస్

06-01-202006-01-2020 08:36:50 IST
Updated On 06-01-2020 12:33:10 ISTUpdated On 06-01-20202020-01-06T03:06:50.154Z06-01-2020 2020-01-06T03:06:07.210Z - 2020-01-06T07:03:10.759Z - 06-01-2020

మునిసిపల్ రిజర్వేషన్లు షురూ.. కోర్టుకెళతామన్న కాంగ్రెస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలకు అంతా సిద్ధమయింది. వివిధ మునిసిపాలిటీలు, కార్పోరేషన్లకు రిజర్వేషన్లు ఖరారుచేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. బీసీలకు 33 శాతం వరకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రాష్ట్ర మున్సిపాలిటీల చట్టంలో విధించిన గరిష్ట పరిమితి మేరకు మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు 32.5 నుంచి 33 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల చైర్‌పర్సన్, 13 మున్సి పల్‌ కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టీకే శ్రీదేవి ప్రకటించారు.

మొత్తం 123మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ స్థానాల్లో బీసీలకు 40, ఎస్సీలకు 17, ఎస్టీలకు 4 రిజర్వ్‌కాగా ఓపెన్‌ కేటగిరీకి 62 స్థానాలు రిజర్వు చేశారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకుగాను ఎస్సీ, ఎస్టీలకు చెరో స్థానం, బీసీలకు 4, ఓపెన్‌ కేటగిరీలో 7 స్థానాలు రిజర్వు అయ్యాయి. రాష్ట్రంలో కొత్త మున్సిపల్‌ చట్టం అమల్లోకి రావడంతో మళ్లీ కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించారు.

తాజా మున్సిపల్‌ ఎన్నికలతోపాటు మరో రెండు పర్యాయాలు కలిపి మొత్తం మూడు వరుస సాధారణ ఎన్నికల్లో ఇవే రిజర్వేషన్లు అమలవుతాయి. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు కలిపి మొత్తం 141 పురపాలికలు ఉన్నాయి. ఇందులో షెడ్యూల్డ్‌ ఏరియా పరిధిలో ఉన్న 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ జరపాలి. 

గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా ఏర్పడిన 2 కొత్త మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియకపోవడంతో అక్కడ ఎన్నికలు జరిపే అవకాశం లేదు. దీంతో  ఐదు మున్సిపాలిటీలకు తర్వాత ఎన్నికలు జరుగుతాయి. జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలోని వార్డులు/డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ నెల 7న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. వీటికి 22న పోలింగ్‌ నిర్వహించి 25న ఫలితాలు ప్రకటిస్తారు.

13 మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎస్టీల జనాభా 1.9 శాతం మాత్రమే ఉన్నా నిబంధనల ప్రకారం వారికి ఒక మేయర్‌ పదవిని కేటాయించారు. కార్పొరేషన్లలో ఎస్సీల జనాభా 3.6 శాతం ఉండగా వారికి కూడా నిబంధనల ప్రకారం ఒక మేయర్‌ సీటును కేటాయించడంతో 8 శాతం కోటా అమలు చేసినట్లు అయింది. బీసీలకు 4 మేయర్‌ స్థానాలు కేటాయించడంతో 33 శాతం రిజర్వేషన్లు వారికి కల్పించినట్లు అయిందని శ్రీదేవి వెల్లడించారు. 

మునిసిపాల్టీలలో రిజర్వేషన్లు ఇవే:

బీసీ (జనరల్‌): నారాయణ్‌ఖేడ్, ఆందోల్‌–జోగిపేట్, గద్వాల, నిర్మల్, రాయికల్, ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్, పరిగి, వనపర్తి, అమరచింత, రామాయంపేట, చౌటుప్పల్, కొడంగల్, ఖానాపూర్, తూప్రాన్, మంచిర్యాల, బాన్సువాడ, ఆలేరు, భువనగిరి, నర్సాపూర్‌

బీసీ (మహిళ): సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, సదాశివపేట, చండూరు, భీంగల్, ఆర్మూర్, కోస్గి, మెట్‌పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, బోధన్‌

ఎస్సీ (జనరల్‌): క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, ఇబ్రహీంపట్నం, వైరా, ఐజా, నస్పూర్, నేరెడ్‌చర్ల, తొర్రూరు, నర్సింగి

ఎస్సీ (మహిళ): మధిర, పరకాల, పెబ్బైర్, అలంపూర్, వర్ధన్నపల్లి, భూపాలపల్లి, పెద్ద అంబర్‌పేట, తిరుమలగిరి

ఎస్టీ (జనరల్‌): ఆమనగల్, డోర్నకల్‌,ఎస్టీ (మహిళ): వర్ధన్నపేట, మరిపెడ

ఓసీ (జనరల్‌): మెదక్, దేవరకొండ, గజ్వేల్, జహీరాబాద్, కొత్తపల్లి, ఎల్లందు, అచ్చంపేట, భూత్పూర్, లక్సెట్టిపేట, జమ్మికుంట, కాగజ్‌నగర్, కల్వకుర్తి, షాద్‌నగర్, తుక్కుగూడ, పోచారం, దమ్మాయిగూడ, ఆదిబట్ల, చిట్యాల, ఆదిలాబాద్, అమీన్‌పూర్, మహబూబాబాద్, మిర్యాలగూడ, సత్తుపల్లి, కొంపల్లి, నాగారం, తుంకుంట, బొల్లారం, మణికొండ, జల్పల్లి, హాలియా, నల్లగొండ.

ఓసీ (మహిళ): చొప్పదండి, పెద్లపల్లి, వేములవాడ, కొత్తకోట, చేర్యాల, దుబ్బాక, మోత్కూరు, ఆత్మకూరు, కామారెడ్డి, తాండూరు, చెన్నూరు, దుండిగల్, జనగామ, నాగర్‌ కర్నూల్, శంషాబాద్, హుస్నాబాద్, మంథని, హుజూర్‌నగర్, హుజూరాబాద్, శంకర్‌పల్లి, వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, ఘట్‌కేసర్, మేడ్చల్, నందికొండ, తెల్లాపూర్, కోదాడ, తుర్కయాంజల్, గుండ్ల పోచంపల్లి

మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ రిజర్వేషన్లు

ఎస్సీ (జనరల్‌): రామగుండం

ఎస్టీ (జనరల్‌): మీర్‌పేట

బీసీ (జనరల్‌): బండ్లగూడ జాగీర్, వరంగల్‌

బీసీ (మహిళ): జవహర్‌నగర్, నిజామాబాద్‌

ఓసీ (జనరల్‌): కరీంనగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ

ఓసీ (మహిళ): ఖమ్మం, నిజాంపేట్, బడంగ్‌పేట్, జీహెచ్‌ఎంసీ

కోర్టుకెళతాం: ఉత్తమ్ 

ఇదిలా ఉంటే.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డుల వారీగా రిజర్వేషన్‌ ఖరారు చేయడంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు.హడావిడిగా మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను చేపట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదో తేదీన రిజర్వేషన్లు ఖరారు చేసి.. ఆరో తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయడం.. ఎనిమిదో తేదీన నామినేషన్లు స్వీకరించడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ విషయమై మరింత గడువు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle