మునిసిపల్ పోరు బీజేపీకి కలిసొచ్చిందా? బలం పెరిగిందా?
29-01-202029-01-2020 09:48:57 IST
Updated On 29-01-2020 09:56:42 ISTUpdated On 29-01-20202020-01-29T04:18:57.232Z29-01-2020 2020-01-29T04:15:51.483Z - 2020-01-29T04:26:42.604Z - 29-01-2020

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ప్రకటించిన బీజేపీ అందులో సక్సెస్ అయిందా? అంటే ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదనే చెప్పాలి. కానీ బీజేపీ నేతలు మాత్రం తాము రెండవ స్థానంలో ఉన్నామని, తమ బలం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారు. గతంతో పోలిస్తే తాము 90 శాతం స్థానాల్లో సొంతంగా పోటీ చేయగలిగామనీ, ఎలాంటి పొత్తూ లేకుండా బలమయిన పోటీ ఇచ్చామంటున్నారు. కేవలం అధికారం అండతో, ధన బలం, సంక్షేమపథకాల పేరు చెప్పుకుని టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిచారని ఆరోపించారు.మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి దక్కిన ఓట్ల శాతం 43 , కాంగ్రెస్ 22 శాతం వరకూ పొందింది. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని భావిస్తున్నా, నాయకత్వ లేమి వల్ల ఫలితాలు ఆశించినమేరకు రావడం లేదని అంటున్నారు. అయితే, బీజేపీ 15 శాతం ఓటింగ్ దక్కింది. కార్పొరేషన్లలో దాదాపు 22 శాతం వరకూ బీజేపీకి ఓటేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ పట్టు కొంతమేరకు పెరిగిందనే చెప్పాలి. లక్ష్మణ్ చెబుతున్నట్టు ఇప్పటికిప్పుడు రెండో స్థానంలో బీజేపీ రావడం కష్టమే. ఎన్నికలకు మరో నాలుగేళ్ళ వరకూ సమయం ఉంది. ఈలోపు సంస్థాగతంగా బలం పెంచుకుంటే టీఆర్ఎస్ బలం తగ్గడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో అధికారంలో ఉండటం, దేశవ్యాప్తంగా ఒక అనుకూలత మోడీకి ఉండటం ఇక్కడా ప్లస్ అయింది. ఎంఐఎంకి పోటీగా ఓటు బ్యాంకును సాధించడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఓటింగ్ శాతం పరంగా చూసుకుంటే బీజేపీ తెలంగాణలో ఇప్పుడు మూడో స్థానంలోనే ఉన్నా… ఈ మూడు కారణాల దృష్ట్యా ఆ పార్టీ పట్టు పెరిగేందుకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేం. ఇప్పటికిప్పుడు బీజేపీతో ఇబ్బందేం లేదని కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఈజీగా తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడడం ఖాయం. మరోవైపు కేంద్ర నాయకత్వం సూచనలతో బీజేపీ-జనసేన కలిసి నడవాలిన భావిస్తున్నాయి. మునిసిపల్ ఎన్నికల్లో రెండుపార్టీలు అవగాహనతో ముందుకెళితే మరిన్ని మంచి ఫలితాలు లభించి వుండేవని అంటున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపారు. అదే బీజేపీ-జనసేనలు కలిసి వుంటే ఆ ఓట్లు కొంతమేరకైనా బీజేపీకి లాభించేవి.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా