newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మునిసిపల్ టికెట్ల కోసం పోటాపోటీ

31-12-201931-12-2019 09:45:03 IST
Updated On 31-12-2019 10:33:11 ISTUpdated On 31-12-20192019-12-31T04:15:03.953Z31-12-2019 2019-12-31T04:15:00.214Z - 2019-12-31T05:03:11.777Z - 31-12-2019

మునిసిపల్ టికెట్ల కోసం పోటాపోటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమయిన వేళ రాజకీయపార్టీలో సందడి నెలకొంది. అధికారపార్టీలో ఈ పోటీ విపరీతంగా వుంది. ఇటు బీజేపీలో టికెట్ల లొల్లి నడుస్తోంది. పార్టీ నాయకుల మధ్య విభేదాలతో తమవర్గం వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు నేతలు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు సైతం తమకు పట్టున్న చోట తమ వర్గంవారికి టికెట్లు ఇప్పించుకునేందుకు అధిష్టానం పై వత్తిడి పెంచుతున్నారు.

లోక్ సభ ఎన్నికలలో ఆదిలాబాద్ సీటుని బీజేపీ కైవసం చేసుకుంది. ఇదే స్ఫూర్తితో ఆదిలాబాద్ మునిసిపాలిటీని చేజిక్కుంచుకునేందుకు కమలం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బీజేపీలో ముఖ్యనేతల మధ్య విభేదాలపై ఎంపీ సోయం బాపూరావు అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి తీరాలని బీజేపీ కృతనిశ్ఛయంతో ఉంది. నేతల మధ్య గ్రూపు తగాదాలు కొంత కాలంగా కొనసాగుతున్నాయి. 

పార్టీలో ఒక ముఖ్యనేత తన బంధువుకు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టాలనే యత్నంతో తన అనుకునే వారికే మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, గెలుపు కుర్రాలకే టికెట్లు ఇస్తామని ఎంపీ చెప్పడంతో వారంతా అవాక్కవుతున్నారు. బీజేపీలో పైరవీలకు అవకాశం లేదని ఎంపీ సోయం బాపూరావు కఠినంగా హెచ్చరించారు. అంతేకాకుండా నాయకుల వెంబడి తిరగవద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు దరఖాస్తును పార్టీ కార్యాలయంతో పాటు తన కార్యాలయంలో కూడా తప్పని సరిగా ఇవ్వాలంటున్నారు.

మరోవైపు అధికార పార్టీ నేతలు కూడా తమ అనుయాయులకు టికెట్లు ఇచ్చుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపై ఎమ్మెల్యేల బంధువులు కన్నేశారు.

మెజారిటీ ఛైర్మన్ పదవులు తమ వారికే దక్కేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి అనుగుణంగా మున్సిపల్ ఛైర్మన్ రిజర్వ్ అయ్యే విధంగా ఎమ్మెల్యేలు పావులు కదుపుతుంటే మున్సిపల్ పీఠంపై కన్నేసిన బంధువులు బస్తీలను చుట్టొస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. 

నిజామాబాద్ ఛైర్మన్ పీఠం జనరల్ కు రిజర్వ్ అవుతుందనే ప్రచారంతో బీజేపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి వినయ్ రెడ్డి సైతం తన భార్య అనన్య రెడ్డిని ఛైర్మన్ రేసులో నిలబెట్టారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్ - బీజేపీల మధ్య ఉండటంతో ఇక్కడి పోటీ రసవత్తరంగా మారింది. ఎలాగైనా బీజేపీ తన సత్తా చాటాలని చూస్తోంది.

నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిన అధికార పార్టీ ఛైర్మన్ పీఠాలను తమ బంధువులకు దక్కేలా ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నారు. లోక్ ృసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైనా.. ఈసారి అన్ని మునిసిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేయాలనే కృత నిశ్చయంతో వున్నారు. ఛైర్మన్ పీఠాలను తమ బంధువులకు దక్కేలా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నారు.

ఆర్మూర్ మున్సిపల్ ఛైర్మన్ రేసులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోదరుడు రాజేశ్వర్ రెడ్డి ముందున్నారు.. మున్సిపల్ పీఠంపై కన్నేసిన అధికార పార్టీ కేసీఆర్ పథకాలను ప్రచారం చేసుకుంటున్నారు. ఛైర్మన్ సీటుపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే సోదరుడు తన అన్న చేసిన అభివృద్ధిని నమ్ముకుని ప్రజలతో కలిసి తిరుగుతున్నారు.

రిజర్వేషన్ ఖరారు కాకున్నా ఛైర్మన్ అభ్యర్ధిని తానే అంటున్నారు.ఇటు బోధన్ మున్సిపాలిటీ ఛైర్మన్ రేసులో ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ భార్య ఆయోషా ఫాతిమా ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఆమె కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఎం.ఐ.ఎం. పొత్తుతో ఈజీగా ఛైర్మన్ పీఠం దక్కించుకోవచ్చనే అంచనాలో ఉన్న ఎమ్మెల్యే షకీల్ అందుకు అనుగుణంగా ఛైర్మన్ పీఠం తన భార్యకు దక్కేలా పావులు కదుపుతున్నారు. ఆమె వార్డులన్నీ తెగ చుట్టేస్తున్నారు. 

మరోవైపు బాన్సువాడ మున్సిపల్ తొలి ఛైర్మన్ కావాలని టీఆర్ఎస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. తొలి ఛైర్మన్ గా గెలిస్తే చరిత్రలో చిరస్థాయిగా తమ పేరు నిలిచిపోతుందనే భావనలో ఛైర్మన్ రేసులో బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పోచారం శంభురెడ్డి కన్నేశారు. మొత్తం మీద తెలంగాణలో అటు బీజేపీ-ఇటు టీఆర్ఎస్ నేతలు మునిసిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు, తమ వారిని గెలిపించుకునేందుకు సాధ్యమయినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మునిసిపల్ పోరు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   44 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   16 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle