newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం... 25న ఫలితాలు

22-01-202022-01-2020 07:46:43 IST
Updated On 22-01-2020 11:20:08 ISTUpdated On 22-01-20202020-01-22T02:16:43.821Z22-01-2020 2020-01-22T02:16:35.007Z - 2020-01-22T05:50:08.267Z - 22-01-2020

మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం... 25న ఫలితాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.  9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహిస్తున్నారు. 

9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్లలో ఒక డివిజన్‌, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా 324 డివిజన్లు, 2,647 వార్డులకు అధికారులు పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. 

కార్పొరేషన్ల బరిలో 1,746 మంది అభ్యర్థులు, మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 11,099 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 45 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోనున్నారు. పోలింగ్‌కు నిర్వహణకు 50వేల మందికి సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Image

ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల పని తీరు, సమర్థతకు గీటురాయిగా మారనున్నాయి. పురపాలక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఎమ్మెల్యేలకు సైతం కీలకంగా మారనుంది. 

ఓటమికి ఎమ్మెల్యేలదే బాధ్యత అని విభేదాలు మరిచి ముందుకెళ్ళాలని సీఎం కేసీయార్ సూచించారు. ఎన్నికల గెలుపోటములు పార్టీలో వారి ప్రాధాన్యతను నిర్దేశించనున్నాయి. భవిష్యత్తులో పదవులు అందుకోవడానికి దోహదపడనున్నాయి. ఈనెల 25న ఫలితాల వెల్లడి సందర్భంగా తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్సీలు, ఎంపీలకు అధిష్టానం ఆదేశించింది. ఇటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle