newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

మునిసిపల్ ఎన్నికల్లో మద్యం జోరు.. అమ్మకాల హోరు

19-01-202019-01-2020 08:18:13 IST
Updated On 19-01-2020 08:23:56 ISTUpdated On 19-01-20202020-01-19T02:48:13.467Z19-01-2020 2020-01-19T02:47:42.534Z - 2020-01-19T02:53:56.467Z - 19-01-2020

మునిసిపల్ ఎన్నికల్లో మద్యం జోరు.. అమ్మకాల హోరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ ఎన్నికలు జరిగినా బీరు, బిర్యానీ పాత్ర కాదనలేనిది. తెలంగాణలో ఏడాది కాలంగా ఎన్నికలు జరుగుతూనే వున్నాయి. తొలుత అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తే, ఆ తర్వాత పంచాయితీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తరవాత లోక్ సభ ఎన్నికలు జరిగాయి. వరుస ఎన్నికలతో ఓటర్లకు మందు, విందు మజా లభిస్తూనే వున్నాయి. ఇక చివరిదశ మునిసిపల్ ఎన్నికలు రానే వచ్చాయి. 1

సంక్రాంతి పండుగ, ఇటు ఎన్నికల పండుగ మద్యం దుకాణాల అమ్మకాలను బాగా పెంచేశాయి. సంక్రాంతి పండుగ  అంటేనే సందడి. అలాంటిది లిక్కర్‌ అమ్మకాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి తోడు మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతుండడంతో పండగకి ముందు రోజు, పండగ తరువాత రోజుతో కలుపుకుని మొత్తం రూ.26.10కోట్ల విలువైన బీరు, లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి.

ఎంత కాదనుకున్నా మద్యం, రాజకీయం మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఎన్నికల ప్రభావం మద్యం అమ్మకాల మీద ఎంతగా ఉందో అర్థం అవుతుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఓటర్లకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు.

ఎన్నికల వ్యయంలో ఈ మందు భాగం పెరగకుండా కూపన్ల రూపంలో మద్యం షాపులకు ఇస్తున్నారు. ఓటర్లు కూపన్ తీసికెళితే చాలు వారికి కావల్సిన మద్యం అందిస్తున్నారు షాపు ఓనర్లు. అలావచ్చిన కూపన్లకు సంబంధించిన మొత్తం నగదు రూపంలో అందిస్తున్నారు అభ్యర్ధులు.

పోలింగ్ సమయంలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. దీంతో ముందస్తుగానే మద్యాన్ని స్టాక్ చేసి పెట్టుకుంటున్నారు. ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా కూడా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని మద్యం విక్రయ దారులు తెలిపారు.

ఆ తర్వాత 16తేదీన కూడా అమ్మకాలు జోరందుకున్నాయి. కొంత మంది నాయకులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచడం పక్కన బెడితే, మద్యం బాటిళ్లను పంచే విధంగా పార్టీలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. ఈ ఎన్నికలు మద్యం ప్రియులకు మజా, మద్యం షాపు ఓనర్లకు మాత్రం లాభాలు తెచ్చిపెడుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle