newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మునిసిపల్ ఎన్నికలకు టీడీపీకి అభ్యర్ధులు దొరికారట!

29-12-201929-12-2019 07:16:16 IST
2019-12-29T01:46:16.785Z29-12-2019 2019-12-29T01:46:14.451Z - - 22-04-2021

మునిసిపల్ ఎన్నికలకు టీడీపీకి అభ్యర్ధులు దొరికారట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు తెలంగాణ తెలుగుదేశం రెడీ అవుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో క‌లిసి పొత్తు పెట్టుకుంది. కానీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా వెళ్లాల‌ని ప్లాన్ చేస్తోంది. రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు కాగానే అభ్య‌ర్ధులు ఎవ‌రు..? అనేది ప్ర‌క‌టించ‌నున్నారు.

తెలంగాణ‌లో టీడీపీకి ఇంకా కేడ‌ర్ ఉంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. కీల‌క నేత‌లు వ‌ల‌స వ‌ళ్లినా ప‌ట్ట‌ణాల్లో కార్య‌క‌ర్త‌లు ఇంకా పార్టీని వీడ‌లేద‌ని న‌మ్ముతోంది. ఎప్పుడైనా ఎన్నిక‌ల్లో పోటీచేసే అవ‌కాశం రాక‌పోదా..? అని వెయిటింగ్ చేస్తున్న ఈ కార్య‌క‌ర్త‌ల‌ను ఇప్పుడు బ‌రిలోకి దింపేందుకు పార్టీ రెడీ అవుతోంది.

ఎన్నిక‌ల అంశంపై ఇప్ప‌టికే లోక‌ల్ లీడ‌ర్స్‌కు పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ కావాల‌ని కోరింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పొత్తుతో పార్టీ పూర్తిగా డీలాప‌డిపోయింది. దీంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కేడ‌ర్‌లో కొంత జోష్ తీసుకొచ్చేందుకు విడిగా పోటీ చేయాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది.

కాగా, ఇప్ప‌టికే తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 30న ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేసేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఓటర్ల జాబితాపై ఈ నెల 31 నుంచి జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌నున్నారు.

అంతేకాకుండా, ఈ నెల 31న అఖిల‌ప‌క్షంతో ఎన్నిక‌ల సంఘం అధికారులు స‌మావేశం కానున్నారు. జ‌న‌వ‌రి 1న మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో ఈసీ స‌మావేశం జ‌రుగుతుంది. సంక్రాంతి త‌రువాత మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.

120 మున్సిపాల్టీలు, ప‌ది కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, జ‌న‌వ‌రి 18, 19 తేదీల్లో పోలింగ్ ఉండే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల విశ్వ‌స‌నీయ స‌మాచారం.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle