newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

ముగిసిన మేడారం జాతర.. కోటిన్నర దాటిన భక్తులు

09-02-202009-02-2020 11:12:34 IST
Updated On 10-02-2020 17:34:02 ISTUpdated On 10-02-20202020-02-09T05:42:34.504Z09-02-2020 2020-02-09T05:42:25.535Z - 2020-02-10T12:04:02.781Z - 10-02-2020

ముగిసిన మేడారం జాతర.. కోటిన్నర దాటిన భక్తులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహా కుంభమేళా, గిరిజనుల పండుగ మేడారం జాతర ముగిసింది. మేడారం గిరిజన మహాజాతర ముగిసింది. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మొదలైన మేడారం మహాజాతర గురువారం సమ్మక్క రాకతో పరిపూర్ణమైంది. శనివారం సాయంత్రం తల్లుల వనప్రవేశంతో జాతర ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అసాధారణ ఏర్పాట్లతో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీయార్, మంత్రులు, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, తమిళసై మేడారం జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు రోజులపాటు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి తల్లులకు మొక్కులు సమర్పించారు.

ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీయార్ సమ్మక్కసారలమ్మలకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్చించారు. మహాజాతర చివరిరోజు సైతం భక్తులు, వీఐపీల ప్రవాహం తగ్గలేదు. మధ్యాహ్నం 45 నిమిషాలపాటు మేడారంలో భారీ వర్షం కురిసింది. 

జాతర ప్రాంగణమే కాకుండా క్యూలైన్లు, తల్లుల గద్దెలు తడిసి ముద్దయ్యాయి. వర్షంలోనూ తల్లులను దర్శించుకొనేందుకు భక్తులు పోటీపడ్డారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్‌ముండా, రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్‌రెడ్డి తదితరులు వనదేవతలను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించారు.

మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జాతర నిర్వహణలో భాగస్వామ్యమైన శాఖల మంత్రులు, సమస్త అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 

గతంతో పోలిస్తే సౌకర్యాలు మెరుగుగా వున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ 20 లక్షల మంది భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఇటు రైల్వే శాఖ ప్రత్యేక రైలు సర్వీసులు నడిపింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ నాలుగు రోజులు జాతరలోనే మకాం వేశారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మూడురోజులు మేడారంలోనే ఉండి రాష్ట్ర, జాతీయ ప్రజాప్రతినిధులకు దర్శనం ఏర్పాట్లు చేయడం విశేషం.

నాలుగురోజులపాటు భక్తులకు దీవెనలు అందించిన జనదేవతలు వనప్రవేశం చేశారు.మేడారం జాతర విజయవంతంగా పూర్తవడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తంచేశారు. అన్ని ప్రభుత్వశాఖలు పూర్తి సమన్వయంతో వ్యవహరించి, కోట్ల మంది పాల్గొన్న మహాజాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించారని అందరినీ ప్రశంసించారు. 

 

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   15 minutes ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   20 minutes ago


అప్పుడు చంద్ర‌బాబు చేసిన త‌ప్పే ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్నారా..?

అప్పుడు చంద్ర‌బాబు చేసిన త‌ప్పే ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్నారా..?

   28 minutes ago


ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూర్చొని సెటిల్ చేసుకుంటారా..?

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూర్చొని సెటిల్ చేసుకుంటారా..?

   35 minutes ago


సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   16 hours ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   20 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   20 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   a day ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   a day ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   25-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle