newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తీరిక లేదా..?

04-12-201904-12-2019 12:29:48 IST
2019-12-04T06:59:48.001Z04-12-2019 2019-12-04T06:59:46.244Z - - 24-02-2020

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తీరిక లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైద‌రాబాద్ శివారులో జ‌రిగిన వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశ దారుణ హ‌త్య దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. దేశంలో ప్ర‌తీ ఒక్క‌రినీ ఈ సంఘ‌ట‌న క‌లిచివేసింది. దిశ హంత‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌నే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఊరూవాడా ఈ డిమాండ్‌తో ర్యాలీలు జ‌రుగుతున్నాయి. పార్ల‌మెంటు సైతం ఈ ఘ‌ట‌న‌పై ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

జాతీయ మీడియా ఈ ఘట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకుంది. దేశ ఐటీ హ‌బ్ హైద‌రాబాద్‌లో దారుణ సంఘ‌ట‌న అంటూ, హైద‌రాబాద్ నిర్భ‌య దిశా అంటూ పెద్ద ఎత్తున వార్త‌లు ప్రసారం చేస్తోంది. సోష‌ల్ మీడియాలో కూడా ఘ‌ట‌న జ‌రిగిన నాటి నుంచి ఈ అమాన‌వీయ సంఘ‌ట‌న‌పైన చ‌ర్చ జ‌రుగుతోంది.

దిశ త‌ల్లిదండ్రుల‌ను వివిధ పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శిస్తున్నారు. ధైర్యం చెబుతున్నారు. అయితే, ఇంత పెద్ద సంఘ‌ట‌న జ‌రిగినా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం స‌క్ర‌మంగా స్పందించ‌లేద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఘ‌ట‌న జ‌రిగిన మూడురోజులకు ఆర్టీసీ కార్మికుల‌తో స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు. అదే రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు.

అయితే, బాధితురాలి కుటుంబాన్ని మాత్రం కేసీఆర్ ప‌రామ‌ర్శించ‌లేదు. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ విద్యార్థి నేత పెళ్లికి, ఓ ఎమ్మెల్యే కూతురు వివాహానికి మాత్రం కేసీఆర్ హాజ‌ర‌య్యారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జాతీయ మీడియా కేసీఆర్ వైఖ‌రిని తీవ్రంగా ఎండ‌గ‌డుతోంది.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిసేందుక‌ని కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఆయ‌న ఢిల్లీ చేరుకోగానే విమానాశ్ర‌యంలోనే ఓ జాతీయ ఛాన‌ల్ విలేఖ‌రి కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు. ఓ వివాహానికి హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీ వ‌చ్చిన మీరు దిశ కుటుంబాన్ని క‌నీసం ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌కు ముఖ్య‌మంత్రి స‌మాధానం చెప్ప‌లేదు.

అంతకుముందు ఓ టీవీ ఛాన‌ల్ చ‌ర్చ‌లోనే చ‌ర్చ నిర్వ‌హిస్తున్న జ‌ర్న‌లిస్టు టీఆర్ఎస్ ఎంపీ రంజీత్ రెడ్డిని నిల‌దీశారు. దేశం యావ‌త్తు చ‌లించిపోయిన ఈ సంఘ‌ట‌న ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించ‌లేద‌ని, అస‌లు కేసీఆర్ ఎక్క‌డున్నార‌ని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఎంపీ సైతం స‌మాధానం చెప్ప‌లేక ఇబ్బంది ప‌డ్డారు.

మ‌రో ఛాన‌ల్ ఇటీవ‌ల యూఏఈలో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌ను పోల్చి చూపుతూ కేసీఆర్ వైఖ‌రిని నిల‌దీసింది. యూఏఈ యువ‌రాజు ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స‌మ‌యంలో అక్క‌డి చిన్నారుల‌కు షేక్‌హ్యాండ్ ఇస్తున్నారు.

ఆయ‌న‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఓ బాలిక తీవ్రంగా ప్ర‌య‌త్నించినా యువ‌రాజు చూడ‌లేదు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి యువ‌రాజు దృష్టికి వెళ్లింది.

దీంతో వెంట‌నే ఆయ‌న స‌ద‌రు బాలిక ఇంటికి నేరుగా వెళ్లారు. బాలిక‌కు క్ష‌మాప‌ణ చెప్పి అర‌గంట వారి ఇంట్లో ఉండి వ‌చ్చారు. ఈ సంఘ‌ట‌న‌ను పోల్చుతూ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న దిశ ఇంటికి కేసీఆర్ వెళ్ల‌లేద‌ని స‌ద‌రు ఛాన‌ల్ ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది.

తెలుగు మీడియా సంస్థ‌లు ఇలా ప్ర‌శ్నించే ధైర్యం చేయ‌లేదు కానీ.. జాతీయ ఛాన‌ళ్లు మాత్రం కేసీఆర్ దిశ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నాయి.

అయితే, దిశ కుటుంబాన్ని ఘ‌ట‌న జ‌రిగిన తెల్లారే ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు మ‌హ‌బూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, స‌బిత ఇంద్రారెడ్డి వంటి వారు ప‌రామ‌ర్శించారు. న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

డీజీపీ సైతం ఆమె కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడారు. కానీ, కేసీఆర్ కానీ, ఆ కుటుంబం నుంచి మంత్రులు కేటీఆర్ కానీ, హ‌రీష్ రావు కానీ, మాజీ ఎంపీ క‌విత కానీ ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌ను ట్విట్ట‌ర్‌లో మాత్ర‌మే వారు ఖండించారు. కేటీఆర్ మాత్రం నిందితుల‌కు క‌ఠిన శిక్ష వేసేలా చ‌ట్టాలు చేయాల‌ని ప్ర‌ధానిని ట్విట్ట‌ర్‌లో కోరారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle